ఆసియా కప్‌నకు భారత జట్టు.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్, తెలుగు తేజానికి లక్కీ ఛాన్స్..!
Womens Asia Cup 2026 India Squad: క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల చివర్లో జరగనున్న ఆసియాకప్ 2026 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో తెలుగు తేజం శ్రీ చరణి చోటు దక్కించుకుంది. ఆ తర్వాత దాదాపు ఇదే జట్టు ఆసియా గేమ్స్‌లోనూ పాల్గొనే చాన్స్ ఉంది.

Womens Asia Cup 2026 India Squad: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం బీసీసీఐ జట్టును అధికారికంగా ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే జట్టు నాయకత్వ బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్ నిలబెట్టుకోగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్లు, యంగ్ తుఫాన్ బ్యాటర్లతో కూడిన బలమైన జట్టును సెలెక్టర్లు ఖరారు చేశారు.
క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ బీసీసీఐ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీద పూర్తి నమ్మకం ఉంచుతూ కెప్టెన్సీ బాధ్యతలను ఆమెకే అప్పగించింది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యూహాలు రచించనుంది. ఓపెనర్ షఫాలీ వర్మ, దిగ్గజ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, హిట్టర్ రిచా ఘోష్, భార్తి ఫుల్మాలి జట్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇటీవల అద్భుత ప్రదర్శన చేసిన ప్రేమా రావత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం!
ఈ పటిష్టమైన జట్టులో యువ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ పేరు కనిపించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాలిమర్ యాంకిల్ లిగమెంట్ గాయం తీవ్రత వల్ల ఆమె ఈ మెగా టోర్నమెంట్ కు దూరమైంది. టి20 ప్రపంచకప్ మధ్యలోనే నిష్క్రమించిన శ్రేయాంక, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆసియా కప్ తర్వాత జరగబోయే ఆసియన్ గేమ్స్ నాటికి ఆమె పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.
ఆగస్టు చివరి వారంలో సమరం మొదలు!
మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను బోర్డు త్వరలోనే విడుదల చేయనుంది. ఆగస్టు చివరి వారం ప్రారంభమై సెప్టెంబర్ మధ్య నాటికి ఈ టోర్నీ పూర్తి కానుంది. ఆ వెంటనే సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు ఆసియన్ గేమ్స్ జరగనున్నాయి. ఈ రెండు కీలక పోరులకు భారత మహిళల జట్టును దాదాపు సిద్ధం చేశారు సెలెక్టర్లు. ప్రతీకా రావల్, ఉమా చెత్రీ, మిన్ను మణి, వైష్ణవి శర్మ వంటి ప్రతిభావంతులను స్టాండ్‌బై రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు.
ట్రోఫీ సాధనే లక్ష్యంగా విమెన్ ఇన్ బ్లూ!
భారత జట్టు సమాన సమతుల్యంతో ఎంతో బలంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్లుగా రిచా ఘోష్, జి కమలిని బాధ్యతలు స్వీకరిస్తుండగా, బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ, రాధా యాదవ్, రేణుక సింగ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి పదునైన బంతులతో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి సిద్ధంగా ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న భారత మహిళల జట్టు మరోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమర్థులైన ఆటగాళ్లతో భారత జట్టు అత్యంత పటిష్టంగా రూపుదిద్దుకుంది. ప్రధాన ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ విమెన్ ఇన్ బ్లూ టోర్నీలో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.
మహిళల ఆసియా కప్ కోసం భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్), జి కమలిని (వికె), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమ రావత్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, శ్రీ చరణి, నందినీ శర్మ.
రిజర్వ్‌లు : ప్రతీకా రావల్, ఉమా చెత్రీ (వాక్), వైష్ణవి శర్మ, సయాలీ సత్‌ఘరే, మిన్ను మణి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




