మలేషియా ప్రధాని మన పాటలు ఎంత అద్భుతంగా పాడారో చూడండి.. జస్ట్ వావ్ అంతే..
న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు ముగిసినా, ఆ కల్చరల్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మన బాలీవుడ్ మ్యూజిక్ ఎంత గ్లోబల్ రేంజ్‌లో రచ్చ చేస్తుందో మళ్ళీ ప్రూవ్ అయింది! తాజాగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చేసిన పనే ఇప్పుడు సోషల్ మీడియాలో మైండ్ బ్లాకింగ్ వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్ చేసిన ప్రతీ బ్రిక్స్ ఫోటోకీ, ఆ సిట్యుయేషన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే బాలీవుడ్ సాంగ్స్‌ని పిక్ చేసి ఆడియోగా యాడ్ చేశారు! అంతేకాదు.. ఆయన మంచి సింగర్ కూడా..

ఇక షారూఖ్ ఖాన్ క్రేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్‌గా ఎస్‌ఆర్‌కే మేనియాకి ఫిదా అవుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇండియన్ సినిమా అంటే షారుఖ్ .. షారుఖ్ అంటే ఇండియన్ సినిమా అంటూ విదేశాల్లోని ఎన్నారైలు అభిమానిస్తుంటారు. తాజాగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చేసిన పనే ఇప్పుడు సోషల్ మీడియాలో మైండ్ బ్లాకింగ్ వైరల్ అవుతోంది. ఆయన పోస్ట్ చేసిన ప్రతీ బ్రిక్స్ ఫోటోకీ, ఆ సిట్యుయేషన్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే బాలీవుడ్ సాంగ్స్‌ని పిక్ చేసి ఆడియోగా యాడ్ చేశారు! ప్రధాని మోదీతో ఫోటోకి ఒక సాంగ్, మిగతా వరల్డ్ లీడర్స్‌తో పిక్స్‌కి ఇంకో సాంగ్… ఇలా ఆయన సెలెక్ట్ చేసిన ప్లేలిస్ట్ చూసి నెటిజన్లు లూప్‌లో చూస్తూ క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు.
ప్రపంచ దేశాల నాయకులు తమ బ్రిక్స్ పర్యటన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక భారత్ మండపం వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలకు తనకు స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం షారూఖ్ ఖాన్, కాజోల్ నటించిన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలోని ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ పాటను ఎంచుకున్నారు. ప్రధాని మోదీతో ఉన్న మరొక ఫోటో కోసం, ఆయన షారూఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ నటించిన ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘దిల్ తో పాగల్ హై’ పాటను ఎంపిక చేయడం ఆసక్తిగా మారింది.
ఇక మరో ఫొటో కోసం మలేషియా ప్రధాని సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా నటించిన ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ సినిమాలోని ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ ట్రాక్‌ను ఎంచుకున్నారు. అలాగే భారత్ నుంచి తిరుగు ప్రయాణమైన షాట్స్ కోసం ‘లక్ష్య’ సినిమాలోని ‘కంధోన్ సే మిల్తే హైన్ కంధే’ ట్రాక్ ను వాడారు. ఈ రెండు పాటలు ఐక్యత ను సూచించి కలసికట్టుగా సాగాలనే సందేశాన్ని ఇస్తాయి, దాంతో ఆ పాటలు బ్రిక్స్ ఫోటోలకు సరిగ్గా సూటయ్యాయి.
భారత పర్యటనలో ఇబ్రహీం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ప్రతిపక్ష నాయకులతో కలిసి విందు ఆస్వాదించిన ఫోటోలను పంచుకుంటూ, ఇబ్రహీం ‘వీర్-జారా’ సినిమాలోని ‘ఐసా దేస్ హై మేరా’ అనే పాటను ఎంచుకున్నారు . ఈ పాట భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇరాన్ అధ్యక్షుడితో ఫొటోకు ఏ పాటంటే?
అయితే, ఇరాన్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశం గురించి ఆయన చేసిన పోస్ట్‌కి ఎంచుకున్న పాట ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో భేటీకి సంబంధించిన పోస్ట్ కోసం, ఇబ్రహీం 1957 నాటి ‘నయా దౌర్’ చిత్రం నుండి ‘సాథీ హాత్ బఢానా’ పాటను ఎంచుకున్నారు. ఈ ట్రాక్ చెయ్యి చెయ్యి కలిపి కలసి ముందుకు సాగడం గురించి చెబుతుంది, ఇది ఐక్యత సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరిగ్గా సరిపోయింది.
అందరి దృష్టిని ఆకర్షించిన మరొక పోస్ట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉన్న ఇబ్రహీం ఫోటో. దీని కోసం ఆయన 2001 నాటి ఆమిర్ ఖాన్ చిత్రం ‘లగాన్’ నుండి ‘చలే చలో’ పాటను ఎంచుకున్నారు. ఇది అందరం కలిసి ముందుకు సాగాలనే సందేశాన్ని సూచిస్తుంది.
తమ దౌత్యపరమైన సందేశాలను వ్యాప్తి చేయడానికి బాలీవుడ్ ట్రాక్స్ ను వాడిన వ్యక్తులలో ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో కూడా ఒకరు. అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో పర్యటన సందర్భంగా ‘దిల్ ధడక్నే దో’ సినిమాలోని బాలీవుడ్ సంగీతాన్ని ఉపయోగించారు.
ప్రధాని మోదీ షేర్ చేసిన పాట
గతంలో ప్రధాని మోదీ మలేషియాలో పర్యటించిన సందర్భంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అనేక ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ గౌరవార్థం మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయన విందులో, తమిళ నటుడు ఎంజీఆర్ నటించిన 1975 నాటి హిట్ ‘‘నాలై నమదే’’లోని ఒక సాంగ్ పాడి వినిపించారు. అన్వర్ ఇబ్రహీం మంచి సింగర్ అని ఎంజీఆర్ అభిమాని అని గుర్తించిన ప్రధాని మోదీ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
எனது நண்பர் பிரதமர் அன்வர் இப்ராஹிம் அளித்த மதிய விருந்தில், பாடப்பட்ட பாடல்களில் ஒன்றாக மகத்தான மனிதர் எம்.ஜி.ஆர் நடித்த திரைப்படத்தில் இடம்பெற்ற ‘நாளை நமதே’ என்ற பாடலும் இருந்தது!
இந்தியாவில் உள்ள நம்மில் பலரைப் போலவே, பிரதமர் அன்வர் இப்ராஹிமும் எம்.ஜி.ஆரின் தீவிர ரசிகர் ஆவார்!
@anwaribrahim
— Narendra Modi (@narendramodi) February 8, 2026
బ్రిక్స్ విజయం పై ఎస్ జై శంకర్
ప్రపంచవ్యాప్తంగా విభేదాలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు దౌత్యపరంగా పెద్ద విజయం సాధించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశం, విభేదాలు ఉన్న దేశాలను కూడా ఒకే వేదికపైకి తెచ్చి, క్లిష్టమైన విషయాల్లో అందరినీ ఒప్పించగల భారత్ సామర్థ్యాన్ని నిరూపించిందని అన్నారు.