AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG 2nd T20I: నేడు భారత్ – ఆఫ్ఘనిస్తాన్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, వెదర్ అప్డేట్ ఇదే

IND vs AFG 2nd T20I: రెండో టీ20 నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. తొలి మ్యాచ్ గెలిచిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుండగా, వర్షం ముప్పు స్వల్పంగా ఉంది. వరుణ్ చక్రవర్తి గైర్హాజరుతో రవి బిష్నోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

IND vs AFG 2nd T20I: నేడు భారత్ - ఆఫ్ఘనిస్తాన్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, వెదర్ అప్డేట్ ఇదే
Ind Vs Afg 2nd T20i
Rakesh
|

Updated on: Sep 15, 2026 | 1:14 PM

Share

IND vs AFG 2nd T20I: భారత్ వేదికగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 15) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత అరుణ్ జైట్లీ స్టేడియం ఈ ఉత్కంఠభరిత పోరుకు వేదిక కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తుండగా, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం బలంగా రీఎంట్రీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది.

వాతావరణం, వర్షం ముప్పు

ఢిల్లీలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మ్యాచ్ జరిగే సమయానికి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సుమారు 20 శాతం వర్షం పడే సూచనలున్నాయి. దీనివల్ల టాస్‌ వేయడం కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే రాత్రి 8 గంటల తర్వాత వర్షం తగ్గే అవకాశం ఉండటంతో మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేదని తెలుస్తోంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది.

అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్

ఢిల్లీ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మంచి బౌన్స్ లభించడంతో పాటు బౌండరీ లైన్లు చిన్నవిగా ఉండటం బ్యాటర్లకు పెద్ద ఊరటనిస్తుంది. బంతి బ్యాట్‌పైకి అద్భుతంగా రావడంతో పరుగుల వరద పారడం ఖాయం. అయితే మ్యాచ్ ప్రారంభంలో పేసర్లు, ఆ తర్వాత స్పిన్నర్లు కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపవచ్చు.

టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు తప్పదా?

తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించినప్పటికీ భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ పూర్తి సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో ఆయన స్థానంలో యంగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత జట్టు అంచనా:

సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్నోయ్.

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌ను సోని స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, సరిగ్గా అర్ధగంట ముందు (రాత్రి 7:00 గంటలకు) టాస్ ప్రక్రియ జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us