AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘాటైన ఉల్లికారం.. ఒక్కసారి చేసుకుంటే 6 నెల్లపాటు నిల్వ చేసుకునే ఉల్లిపాయ పొడి!

వంటగదిలో కూరగాయలు లేవని చింతించాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సులభమైన పదార్థాలతో, నిల్వ ఉండే రుచికరమైన ఉల్లికారం చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోస, వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతం. ఈ పర్ఫెక్ట్ రెసిపీ మీ భోజనాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది..

Srilakshmi C
|

Updated on: Sep 15, 2026 | 1:26 PM

Share
వంటగదిలో కూరగాయలు లేవని చింతించాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సులభమైన పదార్థాలతో, నిల్వ ఉండే రుచికరమైన ఉల్లికారం చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోస, వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతం. ఈ పర్ఫెక్ట్ రెసిపీ మీ భోజనాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది.

1 / 6
తయారీకి కావలసిన పదార్థాలు.. ధనియాలు: 2 చెంచాలు, జీలకర్ర: 1 చెంచా, దాల్చినచెక్క: ఒక అంగుళం ముక్క, నూనె: 200-250 గ్రాములు, పల్లీలు: అర కప్పు, ఉల్లిపాయలు: 3 పెద్దవి, సన్నగా చీలికలుగా తరిగినవి, ఎండుమిరపకాయలు: 10-15 (మీ కారానికి తగ్గట్టు), వెల్లుల్లి రెబ్బలు: 2 గడ్డలు, పొట్టుతో సహా, కరివేపాకు: 2-3 రెబ్బలు, ఉప్పు: రుచికి సరిపడా, చింతపండు: చిన్న కాయంత, మిర్చిపొడి: 1 చెంచా (అవసరమైతే) చొప్పున తీసుకోవాలి.

2 / 6
ముందుగా ఒక కడాయిని స్టవ్‌పై పెట్టి, అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారితే పొడి పొడిగా వస్తుంది. అదే కడాయిలో 200-250 గ్రాముల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత అర కప్పు పల్లీలు వేసి చిన్న మంటపై మాడకుండా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. బాగా వేయించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

3 / 6
అదే నూనెలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి చిన్న మంటపై నిదానంగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేయించుకోవాలి. ఈ ప్రక్రియ చట్నీకి మంచి రుచిని, రంగును ఇస్తుంది. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అదే నూనెలో 10-15 ఎండుమిరపకాయలు, పొట్టుతో సహా రెండు వెల్లుల్లి గడ్డలు, శుభ్రం చేసిన కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా మాడకుండా చూసుకోండి.

4 / 6
వేయించిన తర్వాత వీటిని కూడా తీసి చల్లార్చుకోవాలి. అన్ని పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాత, ముందుగా చల్లార్చిన ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు, వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, ఒక చెంచా మిర్చిపొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, కొంచెం గరుకుగా, చేతికి అంటుకోకుండా పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

5 / 6
గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం చట్నీ పొడిని ఒక శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఉల్లికారం చట్నీతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఇడ్లీ, దోస, ఊతప్పం వంటి అల్పాహారాలకు కూడా ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. మీరు కూడా ఈ రుచికరమైన ఉల్లికారం చట్నీని తప్పకుండా ప్రయత్నించి చూడండి..

6 / 6
Follow Us