రోజుకు 3-4 కప్పుల కాఫీతో కాలేయానికి మేలు..?

15 September 2026

TV9 Telugu

TV9 Telugu

కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగే వారిలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులతో మరణించే ప్రమాదం 49 శాతం తక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో గుర్తించారు

TV9 Telugu

రోజుకు అదనంగా రెండు కప్పుల కాఫీ తీసుకోవడం సిరోసిస్‌ ముప్పు 44 శాతం తక్కువగా ఉండటంతో సంబంధం ఉన్నట్లు తేలింది

TV9 Telugu

సిరోసిస్‌ అనేది కాలేయ కణజాలం దెబ్బతిని, కాలేయం సాధారణంగా పనిచేయడాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి

TV9 Telugu

కాలేయ క్యాన్సర్‌లో అత్యంత సాధారణమైన ప్రాథమిక రకం అయిన హెపటోసెల్యులార్‌ కార్సినోమా (హెచ్‌సీసీ)పై కూడా కాఫీ ప్రభావాన్ని పరిశోధించారు

TV9 Telugu

కాఫీలో ఉండే ప్రయోజనాలు కేవలం కెఫైన్‌ వల్లే కావ‌ని పరిశోధనలు చెబుతున్నాయి. కెఫైన్‌ ఉన్న కాఫీతో పాటు డీక్యాఫినేటెడ్‌ కాఫీ కూడా మంచిదే

TV9 Telugu

కాఫీలో సహజంగా ఉండే ఇతర సమ్మేళనాలు కూడా కాలేయానికి ప్రయోజనం కలిగించడంలో కీల‌క‌పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు

TV9 Telugu

రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తీసుకునే వారిలో కాలేయానికి సంబంధించిన కొన్ని మెరుగైన ఫలితాలతో బలమైన సంబంధం ఉన్నట్లు ఓ అధ్యయనం సూచించింది

TV9 Telugu

అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజుకు 3 లేదా 4 కప్పుల కాఫీ తాగాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా కాఫీని ఎంతవరకు తట్టుకోగలరనే అంశం కూడా ముఖ్యమే.