Telugu News Trending making Bhel Puri Video was gone viral in Social media Telugu Viral News
Viral Video: స్పీడ్ మామూలుగా లేదుగా.. ఇంటర్నెట్ ను ఊపేస్తోన్న హెలికాప్టర్ భెల్.. రుచి చూసేందుకు సిద్ధమా..
సోషల్ మీడియాలో (Social Media) ప్రస్తుతం ఫుడ్ బ్లాగర్ ల హవా నడుస్తోంది. స్థానికంగా దొరికే రుచుల నుంచి ఫేమస్ వంటకాల వరకు విభిన్నంగా వెరైటీగా ఉండే వంటకాలను మనకు అందంగా పరిచయం చేస్తారు. అంతే కాదు ఆ వంట తయారీ విధానం నుంచి....
సోషల్ మీడియాలో (Social Media) ప్రస్తుతం ఫుడ్ బ్లాగర్ ల హవా నడుస్తోంది. స్థానికంగా దొరికే రుచుల నుంచి ఫేమస్ వంటకాల వరకు విభిన్నంగా వెరైటీగా ఉండే వంటకాలను మనకు అందంగా పరిచయం చేస్తారు. అంతే కాదు ఆ వంట తయారీ విధానం నుంచి పూర్తయ్యేంతవరకు చక్కగా వీడియో తీసి పోస్ట్ చేస్తారు. ఆ వంట తయారీ విధానం గురించి చక్కగా వివరిస్తారు. అందుకే ప్రస్తుతం యూట్యాబ్ షార్ట్ వీడియోస్ నుంచి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వరకు వంటల వీడియోలతో నిండిపోయాయి. ఈ వీడియోల (Videos) లో మనం నిత్యం చూసే వంటల నుంచి, ఎప్పుడూ చూడని వంటల వరకు సమస్తం ఉంటాయి. గతేడాది వైరల్‌గా మారిన ముంబై ‘ఫ్లయింగ్ దోస’ వీడియోను మరవకముందే ప్రస్తుతం మరో వెరైటీ వంటకం వీడియో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. భేల్‌పూరి భారతదేశంలో ప్రసిద్ధ చిరుతిండి. బఠాణీలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టొమాటో, స్పైసీ చట్నీ, పఫ్డ్ రైస్‌ను కలిపి తేలికగా రుచికరంగా తయారు చేస్తారు. వీటన్నింటినీ ఒక గిన్నెలో కలుపుకుని కస్టమర్లకు అందిస్తారు.
అయితే.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యాపారి భేల్ పూరిని చాలా వేగంగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వంటకానికి హెలికాఫ్టర్ భెల్ అని పేరు పెట్టేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 94.2k వ్యూస్, 3.3k లైక్‌లు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. భేల్ పూరి తయారు చేస్తున్న వ్యాపారి నైపుణ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇది చాలా వేగవంతమైనదని, ఈ హెలికాప్టర్ భేల్ ను ఒక్కసారైనా రుచి చూడాలి అని వ్యాఖ్యానిస్తున్నారు.