నా అందం చూడుబావయ్యో..అంటున్న కోడిపుంజు.. చెవులకు కమ్మలు.. మెడలో మందుబాటిల్ ..

|

Aug 20, 2024 | 3:40 PM

వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భక్తులు అమ్మవారికి సమర్పించే బోనాలతో పాటు బలిచ్చేందుకు తీసుకొచ్చిన కోడిని కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కోడికి చెవిపోగు, దాని మెడలో క్వార్టర్ బాటిల్ వేసి ముస్తాబు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ఈ వింత దృశ్యం కనువిందు చేసింది. 

నా అందం చూడుబావయ్యో..అంటున్న కోడిపుంజు.. చెవులకు కమ్మలు.. మెడలో మందుబాటిల్ ..
Rooster
Follow us on

తెలంగాణలో గత నెలరోజులుగా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆషాడం సందర్భంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మహాంకాళి, ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు భక్తులు. ఇక ఇప్పుడు తెలంగాణలోని జిల్లాల్లో శ్రావణమాస బోనాల సందడి షురువయ్యింది. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో ఓ వింత దృశ్యం భక్తులు, గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ ఒక కుటుంబీకులు గ్రామ దేవతకు మొక్కులు చెల్లించే క్రమంలో బలిచ్చే కోడిని ముస్తాబు చేసిన విధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

తెలంగాణ ప్రాంతంలో త్యాగాల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రామ దేవతలకు బోనాలతో పాటు కోళ్లు, మేకలను బలి ఇస్తారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భక్తులు అమ్మవారికి సమర్పించే బోనాలతో పాటు బలిచ్చేందుకు తీసుకొచ్చిన కోడిని కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కోడికి చెవిపోగు, దాని మెడలో క్వార్టర్ బాటిల్ వేసి ముస్తాబు చేశారు. మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ఈ వింత దృశ్యం కనువిందు చేసింది.

ఈ సందర్భంగా దేవతకు బలిచ్చే మేకల్ని, కోళ్లను ఇలా కాళ్లకు పసుపు రాసి, కుంకుమ బోట్టు పెడుతుంటారు. అలాగే, ఓ కుటుంబ సభ్యులు అమ్మవారికి మొక్కులు సమర్పించేందుకు గానూ బలిచ్చేందుకు తయారు చేసిన కోడి చెవులకు ఓలలు కట్టి, కత్తికి పూలమాలలు వేసి కోడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. పైగా ఆ కోడి మెడలో మద్యం బాటిల్‌ కూడా వేలాడదీశారు. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..