Viral News: మొబైల్ టాయిలెట్స్‌ను మాఫియా స్టైల్‌లో దొంగతనం.. రూ.40 లక్షలకు పైగా ఖరీదు ఉంటుందని అంచనా..

|

Oct 31, 2023 | 8:59 PM

అసలు ఇలా టాయిలెట్స్ లను దొంగిలించింది ఎవరు సోదరా? అని కూడా అనుకుంటారు. అయితే ఇక్కడ దొంగలు సాధారణ దొంగతనాలతో విసుగు చెందినట్లు ఉన్నారు. ఇప్పుడు మరుగుదొడ్లను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఈ వింత దొంగతనం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. డైలీ స్టార్ కథనం ప్రకారం.. బ్రిటన్ లో ఓ దొంగల ముఠా మాఫియా స్టైల్ లో వింత చోరీలకు పాల్పడుతోంది.

Viral News: మొబైల్ టాయిలెట్స్‌ను మాఫియా స్టైల్‌లో దొంగతనం.. రూ.40 లక్షలకు పైగా ఖరీదు ఉంటుందని అంచనా..
Portable Toilets
Follow us on

ఇప్పటి వరకూ బంగారం, వెండి నగలు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువులతో పాటు.. అప్పుడప్పుడు టమాటా, ఉల్లిపాయ వంటి కూరగాయల ధరలు పెరిగే జరిగే దొంగతనాల గురించి తెలుసు. అయితే ఒక మాఫియా విలువైన వస్తువులను కాకుండా మరుగుదొడ్లను దొంగిలిస్తుంది. ఈ దొంగల ముఠా గురించి తెలిసిన ఎవరైనా సరే ఖచ్చితంగా షాక్ అవుతారు. అంతేకాదు అసలు ఇలా టాయిలెట్స్ లను దొంగిలించింది ఎవరు సోదరా? అని కూడా అనుకుంటారు. అయితే ఇక్కడ దొంగలు సాధారణ దొంగతనాలతో విసుగు చెందినట్లు ఉన్నారు. ఇప్పుడు మరుగుదొడ్లను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఈ వింత దొంగతనం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం.

డైలీ స్టార్ కథనం ప్రకారం.. బ్రిటన్ లో ఓ దొంగల ముఠా మాఫియా స్టైల్ లో వింత చోరీలకు పాల్పడుతోంది. ఈ ముఠా వివిధ చోట్ల అమర్చిన పోర్టబుల్ టాయిలెట్లను దోచుకుంటుంది. ఈ దొంగలు మరుగుదొడ్లను మాత్రమే ఎందుకు దోచుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నివేదిక ప్రకారం వాస్తవానికి ఇక్కడ పోర్టబుల్ టాయిలెట్ల కొరత ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని దొంగలు పక్కాగా ప్లాన్ చేసి మరీ టాయిలెట్స్ ను దొంగలిస్తున్నారు.

వాహనాల్లో వస్తున్న దొంగలు

దొంగల ముఠా వాహనాల్లో  వచ్చి.. అక్కడ ఉన్న పోర్టబుల్ టాయిలెట్‌ను ఈజీగా ఎత్తి వాహనంలో పెట్టి  తరలిస్తున్నారు. ఒక నెల వ్యవధిలో ఆరుబయట ప్రదేశాలలో ఏర్పాటు చేసిన సుమారు 40 పోర్టబుల్ టాయిలెట్లు మాయమైనట్లు నివేదికలు చూపిస్తున్నాయి. వీటి ధర రూ.40 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ మొబైల్ టాయిలెట్లను మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌ల్లో ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు

త్రీ కంట్రీస్ టాయిలెట్ హైర్‌కి చెందిన నీల్ గ్రిఫిన్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన మొబైల్ టాయిలెట్‌లను ఎవరూ తమ సొంతం అంటూ క్లెయిమ్ చేయలేరు. కనుక వీటిని తిరిగి పొందడం కష్టం. ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. అటువంటి పరిస్థితిలో.. దొంగిలించబడిన పోర్టబుల్ టాయిలెట్లను గుర్తించడానికి వీలుగా.. వాటిపై గుర్తు పెట్టాలని పోలీసులు ఇప్పుడు టాయిలెట్ యజమానులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..