Viral Video: వామ్మో.. ఇదెక్కడి ఐడియా స్వామి.. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?.. వీడియో చూస్తే షాకవుతారు…

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భజాలు మోగుతున్నాయి. బంధుమిత్రుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి ఐడియా స్వామి.. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా ?.. వీడియో చూస్తే షాకవుతారు...
Wedding

Updated on: May 03, 2022 | 8:08 PM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి భజాలు మోగుతున్నాయి. బంధుమిత్రుల మధ్య ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా పెళ్లంటే.. పచ్చని పందిరి.. మండపం..భాజా భజంత్రీలు.. బంధుమిత్రుల మధ్య ఎంతో సంతోషంగా అంగరంగా వైభవంగా చేసుకుంటారు. కానీ కొందరు విభిన్నంగా జరుపుకుంటారు. ఇప్పటివరకు నీటిలో పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలు చూసే ఉంటాం. కానీ ఓ జంట మాత్రం ఏకంగా ఆకాశంలో పెళ్లి చేసుకున్నారు..ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా..? అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా అనేక పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మరికొందరు అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో మమ అంటూ కానిచ్చేశారు. కానీ అదే సమయంలో ఓ జంట మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా.. ఏకంగా విమానంలో పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే కాదు.. వారితో ఇరువురి కుటుంబసభ్యులు.. బంధుమిత్రులతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. తమిళనాడులోని మధురైకి చెందిన వధూవరులు రాకేష్, దక్షిణ పెళ్లి మూహూర్తం ఫిక్స్‌ చేశారు. మదురై అమ్మవారి సన్నిధిలో వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే గతేడాది కరోనా ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ విషయం తెలియడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు. కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవలనుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకున్నారు. వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు. విమానం టేకాఫ్‌ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి ఒకటవ్వగా.. కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు. తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో జరిగిన ఈ పెళ్లి వీడియో మరోమారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..