Last Journey: స్మశానంలో చితిపై నుంచి లేచిన వ్యక్తి.. జనం భయంతో పరుగు.. బతికాడంటూ ఆస్పత్రికి తరలింపు

| Edited By: Ram Naramaneni

Jun 03, 2023 | 6:41 PM

'చనిపోయిన' వ్యక్తి నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మోరీనాలో దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు మేల్కొన్న వ్యక్తి, వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మే 30న జరిగినట్లు తెలుస్తోంది.

Last Journey: స్మశానంలో చితిపై నుంచి లేచిన వ్యక్తి.. జనం భయంతో పరుగు..  బతికాడంటూ ఆస్పత్రికి తరలింపు
Viral Video
Follow us on

మరణించాడు అనుకున్న తమ కుటుంబ సభ్యుడు తిరిగి జీవిస్తే.. అది అంత్యక్రియల కోసం స్మశానంలో ఏర్పాట్లు చేస్తుంటే.. నిద్ర లేచినట్లు పాడే మీద నుంచి లేస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది .. చూడాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పై లుక్ వేయాల్సిందే.. ఈ నాటకీయ సన్నివేశం  మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ‘చనిపోయిన’ వ్యక్తి నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడు. మోరీనాలో దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు మేల్కొన్న వ్యక్తి, వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన మే 30న జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జీతూ ప్రజాపతి అనే వ్యక్తి మే 30 న హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యుల సహా స్నేహితులు, ఇరుగుపొరుగువారు జీతూ మరణించాడని  భావించారు. దీంతో సాంప్రదాయ పద్దతితో జీతుకి అంత్యక్రియలు జరపడానికి ఏర్పాట్లు చేశారు. మోరీనాలోని 47వ వార్డులోని శాంతిధామ్‌కు మృత దేహాన్ని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. చితిని పేర్చి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో అతను నిద్ర లేచినట్లు మేల్కొన్నాడు. హఠాత్తుగా అకస్మాత్తుగా జీతూ శరీరం కదలడం ప్రారంభించడంతో అక్కడ ఉన్న జనం.. భయపడి పరుగులు తీశారు. తరువాత జీతు ప్రజాపతి జీవించి ఉన్నాడని గ్రహించారు.

ఇవి కూడా చదవండి

వైద్యుడిని పిలిపించారు. విచిత్రమైన సంఘటన గురించి అతనికి తెలియగానే, వైద్యుడు శ్మశాన వాటికకు పరుగెత్తాడు. జీతుని పరీక్షించి గుండె ఇంకా కొట్టుకుంటుందని డాక్టర్ ధృవీకరించారు. తదుపరి చికిత్స కోసం గ్వాలియర్‌కు పంపారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..