దురదృష్టకరం అంటే ఇదే మరీ.. వేలాది పాములను రక్షించిన వ్యక్తి.. పాము కాటుకే బలి

దీపక్ మహావార్ అనే స్నేక్ క్యాచర్ నల్లత్రాచు పామును తన మెడకు చుట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే, తన కొడుకును స్కూల్లో వదిలి వస్తుండగా అది కాటేసింది. చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్లగా.. రాత్రి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు ముందు పక్కనే ఉన్న వ్యక్తి రికార్డ్‌ చేసిన నాగుపాము మెడలో చుట్టుకుని అతను తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

దురదృష్టకరం అంటే ఇదే మరీ.. వేలాది పాములను రక్షించిన వ్యక్తి.. పాము కాటుకే బలి
Dangerous Snake Handling

Updated on: Jul 16, 2025 | 7:15 PM

పాములు పట్టేవాడు పాము కాటుకే బలవుతాడు అనే సామెతను తరచూగా వింటుంటాం. ఎంత నైపుణ్యం ఉన్నవారైనా విషపూరిత పాములతో అప్రమత్తంగానే ఉండాలి.. లేదంటే.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాసరే..ప్రాణాలు ప్రమాదంలో పడినట్టే.! సరిగ్గా ఈ సామెతను అక్షరాల నిజం చేస్తూ మధ్యప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. పాములు పట్టుకునే వ్యక్తి పాము కాటుకే బలైపోయాడు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా రఘోఘర్ దీపక్ మహావార్ అనే స్నేక్ క్యాచర్ నల్లత్రాచు పామును తన మెడకు చుట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే, తన కొడుకును స్కూల్లో వదిలి వస్తుండగా అది కాటేసింది. చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్లగా.. రాత్రి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు ముందు పక్కనే ఉన్న వ్యక్తి రికార్డ్‌ చేసిన నాగుపాము మెడలో చుట్టుకుని అతను తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

జెపి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిన దీపక్‌ పాములు పట్టుకోవడంలో ఎంతో నేర్పరి. వేలాది పాములను అతడు రక్షించి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. రాబోయే శ్రావణ మాసంలో ఊరేగింపులో ప్రదర్శించడం కోసం ఇటీవల అతను ఒక నాగుపామును పట్టు్కున్నాడు. ఈ క్రమంలోనే ఆ పాము అతడు మెడలో వేసుకుని తిరుగుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..