వీడు మనిషా.. మానవ మృగమా.. అంతటి కింగ్ కోబ్రాను ఆలా ఎలా నిలబెట్టాడు
పాములంటే సాధారణంగా ఎవరికైనా భయమే. ఆఖరికి పాములు పట్టేవారైనా కూడా ఎంతో జాగ్రత్తగా వాటిని పట్టుకుంటారు. కొందరైతే పామును తలచుకుంటేనే భయంతో వణికిపోతారు. అలాంటిది ఓ యువకుడు ఓ భారీ కింగ్ కోబ్రాను ఏమాత్రం భయం లేకుండా ఒట్టి చేతులతో పట్టుకున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఆ పాము సైజును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆ దృశ్యాలు చూస్తే ఒళ్లు జలదరించక మానదు. కానీ, ఆ యువకుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. 11 సెకన్ల వీడియో క్లిప్‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. “కింగ్ కోబ్రా అసలు సైజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి భారత్‌లో ఎక్కడ కనిపిస్తాయో మీకు తెలుసా?” అంటూ క్యాప్షన్ జోడించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రా నడుము భాగాన్ని ఎంతో కాన్ఫిడెంట్‌గా పట్టుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆ పాము భారీసైజు చూసి ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు దాని గంభీరమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాని సైజు చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటూ కామెంట్లు చేశారు. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత సర్పం. ఇది సుమారు 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. మన దేశంలో ఇవి ప్రధానంగా పశ్చిమ, తూర్పు కనుమలతో పాటు అసోం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తాయి. సాధారణంగా ఇవి మనుషుల జోలికి రాకుండా దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైకు ప్రమాదంలో కొడుకు మరణం.. లారీ గుద్దడంతో కూతురికి అవిటితనం! కోట బాధలు వింటే కన్నీళ్లే
2 కోట్లతో సొంతూరిలో ఆసుపత్రి.. ఇంకా ఎన్నో.. బయటికొచ్చిన ఆర్. నారాయణ మూర్తి గొప్పతనం
ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే
రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

