Viral Video: స్నేహం అంటే ఇదేరా.. బల్లిని పట్టుకున్న పాము.. స్నేహితుడి కోసం ప్రాణాలు తెగించి పోరాడిన మరో బల్లి..

కష్టకాలంలో కూడా రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా కష్టము వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని తరచుగా స్నేహితులు సినిమాల్లో చెప్పుకునే డైలాగ్.. అయితే ఈ మాటని మనుషులు ఎంత నిజం చేస్తారో తెలియదు కానీ.. ఒక జీవి మాత్రం నిజం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. బల్లిని పట్టుకున్న పాము.. స్నేహితుడి కోసం ప్రాణాలు తెగించి పోరాడిన మరో బల్లి..
Viral Video

Updated on: Jun 29, 2023 | 11:20 AM

స్నేహం అంటే చందనం చెక్క వంటిది అట.. ఎంత అరగదీసినా సువాసన వెదజల్లే చందనం వలనే స్నేహితుడు అంటే సుఖంలో మాత్రమే కాలేదు.. కష్ట కాలంలో కూడా తోడునీడగా ఉండేవాడు. అందరూ ఆనందంలో పాలుపంచుకుంటారు. అయితే కష్టకాలంలో కూడా రక్షణ కవచంగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఏదైనా కష్టము వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని తరచుగా స్నేహితులు సినిమాల్లో చెప్పుకునే డైలాగ్.. అయితే ఈ మాటని మనుషులు ఎంత నిజం చేస్తారో తెలియదు కానీ.. ఒక జీవి మాత్రం నిజం చేసింది. ఈ విషయాన్నీ తెలియజేసే వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొండమీద ఒక పాము బల్లి జాతికి చెందిన  జెక్కోను పట్టుకుంది. జెక్కోను తన శరీరంతో చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తోంది.. ఇంతలో మరో బల్లి రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్ ను రక్షించడానికి పాముతో ప్రాణాలకు తెగించి హోరాహోరీ పోరాడింది. తానంటే భయపడకుండా పోరాడుతున్న బల్లిని కాటు వేయడానికి పాము శతవిధాలా ప్రయత్నించింది. మరి ఈ పోరాటంలో పాము గెలిచిందా.. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన బల్లి గెలిచిందా తెలియాలంటే.. వీడియో పై మీరు లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో గోడపై ఉన్న ఓ బల్లిని పాము చుట్టేసింది. ఆ తర్వాత మెల్లగా బల్లిని చంపి ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే పాము బారి నుండి బయటపడటానికి బల్లి అనేక విఫల ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడే మరో బల్లి రంగంలోకి దిగి పాముపై దాడి చేసింది. వీడియో చూసిన ఎవరైనా ఒకటే మాట అంటారు.. స్నేహితుడు అంటే ఇలాగే ఉంటాడు..అని ..

ఈ వీడియో ఇన్‌స్టాలో @ivan_starykh_ అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో కంబోడియాలోని అంగ్కోర్ ఆలయం నుండి వచ్చింది. ప్రీ రూప్ ఆలయంలో జెక్కోలు పాము ఒకదానితో ఒకటి పోరాడుతూ కనిపించాయి. మే 26న అప్‌లోడ్ చేసిన వీడియో ఇప్పటి వరకూ 67 వేల లైక్‌లను సొంతం చేసుకోగా నిరంతరం రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..