Viral Video: నీటిలో మొసలిని చీల్చి చెండాడిన చిరుత..! వీడియో మామూలుగా లేదుగా..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 07, 2021 | 10:16 AM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు

Viral Video: నీటిలో మొసలిని చీల్చి చెండాడిన చిరుత..! వీడియో మామూలుగా లేదుగా..
Crocodile Viral Video

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబంధించి మిలియన్ల కొద్ది ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతు ప్రేమికులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. వీడియోలను మళ్లీ మళ్లీ చూస్తారు. జంతువులు, పక్షుల వేటకు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా నీటిలో ఉండే మొసలికి, అడవిలో ఉండే చిరుతపులికి భీకర పోరాటం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అడవిలో మనుగడ సాగించాలంటే జంతువులకు వేట తప్పనిసరని అందరికి తెలుసు. ప్రస్తుతం ఈ వీడియోలో చిరుత, మొసలి మధ్య ఘోరమైన పోరాటం మనం చూడవచ్చు. సాధారణంగా నీటిలో మొసలికి చాలా శక్తి ఉంటుంది. అక్కడ ఎంత పెద్ద జంతువైన దానిని గెలవలేదు. కానీ నీటిలో ఉన్న మొసలిపై కన్నేసింది ఓ చిరుత. మాటు వేసి ఒక్కసారిగా దానిపై దాడి చేస్తుంది. రెండిటి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. కానీ చిరుత పంజా నుంచి మొసలి తప్పించుకోలేకపోతుంది. అది తప్పించుకోవడానికి అస్సలు అవకాశం ఇవ్వదు. చివరికి చిరుతకు ఆహారంగా మారుతుంది. కానీ చిరుత వేట మామూలుగా ఉండదు కదా. ఎంత బలమైన జంతువైనా మాటు వేసి దాడి చేసిందంటే దానికి లొంగిపోవాల్సిందే.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. లైకులు, షేర్లు చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్‌క్యాట్స్‌వైల్డ్‌లైఫ్ అనే పేజీ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా ఇష్టపడ్డారు. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో సర్జికల్ స్ట్రైక్ లాంటిది. ఒక రాజు మరొకరి రాజ్యంలోకి ప్రవేశించి అతడిని ఓడించడం లాంటిది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Gold Loan: ఈ బ్యాంకులలో గోల్డ్‌లోన్‌ చాలా చౌక..! తక్కువ వడ్డీ.. సులువైన వాయిదాలు..

Vinayaka Chavithi: ఇంట్లోనే బంకమట్టితో వినాయక విగ్రహం సులభంగా తయారీ.. స్టెప్ బై స్టెప్..

Viral Video: స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు.. ఇంతలో కొండపై నుంచి పడ్డ భారీ రాళ్ళు.. తరువాత ఏం జరిగిందో మీరే చూడండి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu