చిరుతను పట్టుకుని గొంతునులిమి చంపేసిన గ్రామస్తులు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

అక్కడున్న కొందరు వ్యక్తులు ఇదంతా తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో వీడియోను షేర్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. చిరుతను గొంతు నొక్కి చంపడంపై నెటిజన్లు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో

చిరుతను పట్టుకుని గొంతునులిమి చంపేసిన గ్రామస్తులు.. షాకింగ్‌ వీడియో వైరల్‌
Leopard Strangled
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 05, 2024 | 8:42 PM

పలువురిపై దాడి చేసి గాయపరిచిన చిరుతపులిని స్థానికులు పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీశాఖ అధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్డా తోలా లాల్‌పూర్ గ్రామ సమీపంలో డిసెంబర్‌3న చిరుతపులి కనిపించగా, దానిని కొందరు యువకులు వెంబడించారు. దీంతో ఆ చిరుత రోహిన్ నదిలోకి దూకింది.

కాగా, కొందరు యువకులు ఆ నదిలోకి దూకారు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో ఉన్న ఆ చిరుతను పట్టుకున్నారు. దానిని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత కొందరు యువకులు ఆ చిరుత గొంతు నొక్కి చంపేశారు.. అక్కడున్న కొందరు వ్యక్తులు ఇదంతా తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో వీడియోను షేర్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. చిరుతను గొంతు నొక్కి చంపడంపై నెటిజన్లు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ క్లిక్ చేయండి..

చిరుత మృతదేహాన్ని గోరఖ్‌పూర్ జూ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం అక్కడ ఖననం చేశారు. వృద్ధాప్యం వల్ల బలహీనంగా ఉన్న ఆ చిరుతను గొంతు నొక్కి చంపిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్‌లో స్థానికులు పట్టుకుని గొంతుకోసి చంపిన చిరుతపులి వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..