Viral Video: రెప్పపాటులో జింకను వేటాడిన చిరుత.. గగుర్పొడిచే వీడియో మీకోసమే.!

Leopard Viral Video: సింహాలు, పులులు, చిరుతలను అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులుగా పరిగణిస్తారు. రెప్పపాటులో అవి ఏ జంతువునైనా...

Viral Video: రెప్పపాటులో జింకను వేటాడిన చిరుత.. గగుర్పొడిచే వీడియో మీకోసమే.!
Leopard
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 06, 2021 | 9:39 PM

సింహాలు, పులులు, చిరుతలను అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులుగా పరిగణిస్తారు. రెప్పపాటులో అవి ఏ జంతువునైనా తమ ఎరగా చేసుకుంటాయి. ముఖ్యంగా చిరుత ఎరను వేటాడేటప్పుడు వేగాన్ని, వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

ఆటవిక న్యాయం భిన్నంగా ఉంటుంది. ఏ జంతువు.. ఎప్పుడు.? ఎలా.? దేనిపై దాడి చేస్తుందో ఎవరూ చెప్పలేరు. క్రూర జంతువులతో పాటు సాధు జంతువులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుండాలి. అడవి మనుగడ ప్రతీ క్షణం మరణంతో పోరాటం చేస్తున్నట్లే ఉంటుంది. ఈ వీడియో అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. సరస్సు దగ్గర కొన్ని జింకలు నీరు తాగుతుండగా.. అకస్మాత్తుగా ఓ చిరుత మెరుపు దాడి చేస్తుంది.

వైరల్ వీడియో ప్రకారం అడవిలోని ఓ సరస్సు ఒడ్డున జింకల మంద నీరు తాగుతున్నట్లు చూడవచ్చు. ఈలోపు వాటిపై ఓ చిరుత మెరుపు దాడి చేస్తుంది. అయితే వస్తోన్న ప్రమాదాన్ని గమనించిన జింకలు.. వెంటనే పరుగులు పెడతాయి. అయితే అనూహ్యంగా ఓ జింక చిరుతకు చిక్కుతుంది. ఇంకేముంది జింక ఎంత ప్రయత్నించినా.. చిరుత నుంచి తప్పించుకోలేదు. తన ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ వీడియోను ”IFTIRASS” అనే పేజ్ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. చిరుత వేటను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read: కొండల మధ్య దాగున్న సింహం.. కనిపెట్టండంటూ సవాల్ విసురుతోంది.. గుర్తించండి!

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?