Whale Fish: చనిపోయిన తిమింగలం చాలా ప్రమాదకరం.. దగ్గరలో ఉంటే ప్రాణాలు పోతాయ్..
Whale Fish: ప్రపంచంలోని అతిపెద్ద జీవులలో తిమింగలం ఒకటి. సముద్రంలో ఈ జీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి చనిపోయి ఒడ్డుకు కొట్టుకవస్తాయి.

Whale Fish: ప్రపంచంలోని అతిపెద్ద జీవులలో తిమింగలం ఒకటి. సముద్రంలో ఈ జీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి చనిపోయి ఒడ్డుకు కొట్టుకవస్తాయి. కానీ తిమింగలం డడ్‌బాడీ చాలా ప్రమాదకరం. దాని దగ్గరలో ఉంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బాంబు వలే ఒక్కసారిగా పేలుతుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారికి చాలా ప్రమాదం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.
తిమింగలం శరీరం ఎందుకు ప్రమాదకరం? వాస్తవానికి ప్రతి సంవత్సరం వేలాది తిమింగలాలు చనిపోతున్నాయి. వాటిలో కొన్ని సముద్రపు ఒడ్డుకు కొట్టుకువస్తాయి. తరువాత వాటి శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల అది పేలిపోతుంది. అందువల్ల దీని డెడ్ బాడీ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు.
పేలుడు ఎందుకు జరుగుతుంది? తిమింగలం చనిపోయిన కొద్ది రోజులకే తిమింగలం శరీర భాగాలు లోపల కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా గ్యాస్ ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తిమింగలం బయటి పొర చాలా బలంగా ఉంటుంది. దీంతో వాయువులు శరీరం నుంచి బయటకు వెళ్లలేవు. అంతేకాదు రోజులు గడిచిన కొద్ది వాయువులు నిరంతరం తయారవుతూ ఉంటాయి. దాని నోరు కూడా మూసుకుపోతుంది. గ్యాస్ బయటకు రాలేకపోతుంది. ఇది సమస్యను పెంచుతుంది. దీంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
అందుకే తిమింగలం చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు దాని చుట్టుపక్కల చూస్తే మాంసం ముద్దలు వెదజల్లి ఉంటాయి. దాని శరీరంలోని అన్ని భాగాలు బయటకు వచ్చి అనేక మీటర్ల వరకు వ్యాపించి కనిపిస్తాయి. అనేక టన్నుల బరువు ఉండే తిమింగలం శరీరం పేలినప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది చాలాసార్లు జరిగింది కానీ ఎప్పుడు ప్రమాదం చోటుచేసుకోలేదు కానీ చుట్టుపక్కల ఉండే కార్లు, ఇతర వాహనాలు దెబ్బతినడం మాత్రం జరిగింది.