Viral Video: కింగ్ కోబ్రాకు చుక్కలు చూపించిన ముంగీసలు.. కానీ చివరకు
పాముల్లో చాలా జాతులున్నాయి.ప్రతిపాము ప్రమాదకరమే..అయితే వేయితిలో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రా. ఈ పాము కాటు వేస్తే మరణం ఖాయం.
Viral Video: పాముల్లో చాలా జాతులున్నాయి. ప్రతిపాము ప్రమాదకరమే..అయితే వీటిలో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రా. ఈ పాము కాటు వేస్తే మరణం ఖాయం అంటుంటారు. సాధారణంగాఆ మనుషులు పాములను చూస్తే పరుగందుకుంటారు. వాటి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసించరు. కొంతమంది మాత్రం పాములకు ఏమాత్రం భయపడరు. అయితే పాములంటే అస్సలు భయపడని మనుషులతోపాటు కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. పాములను వేటాడే కొన్ని జంతువులలో ఈ మీర్‌క్యాట్(ముంగీస జాతి జంతువు) ఒకటి. మీర్‌క్యాట్ లు ఎప్పుడు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. వాటి పైకి ఏదైనా జంతువు దాడి చేయడానికి వస్తే వెంటనే అవి గుంపుగా చేరి ప్రతిదాడి చేస్తుంటాయి. అయితే మీర్‌క్యాట్ లకు ఓ కింగ్ కోబ్రా ఎదురైతే ఎలా ఉంటుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎడారిలో మీర్‌క్యాట్ లు సంచరిస్తూ ఉంటాయి. ఆహారాన్ని వెతుకుంటున్న మీర్‌క్యాట్ ల దగ్గరకి ఒక కింగ్ కోబ్రా వస్తుంది. దాన్ని చూసి మీర్‌క్యాట్ లు ముందు భయపడి పరుగు పెడతాయి. ఆ వెంటనే మీర్‌క్యాట్ ల గుంపు కింగ్ కోబ్రాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అన్ని కలిసి దాడి చేయడం ప్రారంభించినప్పటికీ.. కింగ్ కోబ్రా వెనక్కి తగ్గలేదు. అప్పుడు మీర్‌క్యాట్ లు అనుకున్నదాని ప్రకారం నాలుగు వైపుల నుంచి కింగ్ కోబ్రాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అయితే చివరకు పాము వెనక్కి తగ్గి అక్కడినుంచి మెల్లగా జారుకుంటుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 97 లక్షలకు పైగా వీక్షణలు మరియు 62k లైక్‌లు వచ్చాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :