తెలుగు రాష్ట్రాల్లో విష సర్పాలు హడలెత్తిస్తున్నాయి. విశాఖ జిల్లా దేవరపల్లి మండలం, రైవాడ పంచాయతీ పరిధిలో భారీ పొడవైన గిరినాగు ప్రత్యక్షమైంది. శంభువాని పాలెం వాసులను భారీ గిరి నాగు భయపెట్టింది. పొలం పనులు చేస్తున్న రైతులు.. తమకు దగ్గర్లో పాము సంచరించడం గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు.. వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన సిబ్బంది.
సుమారు రెండు గంటలపాటు శ్రమించి 15 అడుగుల పొడవున్న గిరి నాగుపామును పట్టుకున్నారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి కింగ్ కోబ్రాలు దట్టమైన అడవుల్లో ఉంటాయి. జనావాసాల్లో కనిపించడం చాలా అరుదు. తమ ప్రాణాల మీదకు వస్తేగానీ ఇవి మనుషులను కాటేయవని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, ఖమ్మం గిరిజన ప్రాంతాలు, నల్లమల అడవుల్లో ఈ పాములు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పాములు 14 నుంచి 16 అడుగుల పొడవు వరకు పెరుగుతాయంటున్నారు.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!