Viral Video: ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.. ఇంతకీ ఆ నవ్వుకు కారణమేంటంటే.
Viral Video: ఎలాంటి కల్మషం లేని మనసుకు పెట్టింది పేరు చిన్నారులు. సంతోషం వస్తే నవ్వడం, నొప్పి కలిగితే ఏడవడం వీరికి తెలిసిందే ఇంతే.. అంతకు మించి...
Viral Video: ఎలాంటి కల్మషం లేని మనసుకు పెట్టింది పేరు చిన్నారులు. సంతోషం వస్తే నవ్వడం, నొప్పి కలిగితే ఏడవడం వీరికి తెలిసిందే ఇంతే.. అంతకు మించి ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు వీరికి తెలియదు. అందుకే చిన్నారుల చిరునవ్వు ఎంతటి వారినైనా మాయ చేస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నాసరే చిన్నారి నవ్వు వింటే చాలు ఒత్తిడంతా పరార్ అవ్వాల్సిందే. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ చిన్నారి నవ్వు అందరినీ ఆకట్టుకుంటోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏడాదిన్నర కూడా లేని ఆ చిన్నారి పలికించిన హావభావాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులు పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారు. అనంతరం డెలివరీ అయిన తర్వాత పిజ్జాను ఓపెన్ చేసే సమయంలో చిన్నారి అక్కడే ఉంది. దీంతో బాక్స్‌లో ఉన్న పిజ్జా కనిపించగానే చిన్నారి ఒక్కసారి ఫుల్ ఎగ్జైట్‌మెంట్ అయ్యింది. పిజ్జా చూసిన సంతోషంలో రెండు చేతులు పైకెత్తి గాల్లో ఊపుతూ కేరింతలు కొడుతూ మరి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
దీనంతటినీ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చిన్నారి చిరునవ్వుకు ఫిదా అవుతున్నారు. ‘ఎంత వయసు వచ్చినా నేనూ ఇప్పటికీ పిజ్జాను చూస్తే ఇలాగే ఫీల్ అవుతాను’ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు ‘కల్మషం లేని ఆ చిన్నారి చిరు నవ్వు ఎంత బాగుందో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ క్యూట్ స్మైల్‌ను మీరూ చూసేయండి..
Find me someone more excited to eat some pizza than this adorable kid…I’ll wait!?❤??❤?
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) September 10, 2021
Also Read: Viral Video: సింహంపై గుంపుగా హైనాల ఎటాక్.. చావు దాకా వెళ్లింది.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.!
Animal Farmers: పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటే సులువుగా లభిస్తుంది..