ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో తల్లిదండ్రులు సంపాదనపై దృష్టిపెట్టి తమ పిల్లలను పట్టించుకోవడం మానేస్తున్నారు. రెండు సంవత్సరాల వయసు రాగానే.. పిల్లలను ప్లే స్కూల్, ప్రీ స్కూళ్లలో వేసేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తే అంతా స్కూల్ వారే చూసుకుంటారులే అని చేతులు దులుపుకుంటున్నారు. కానీ, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. స్కూల్ యాజమాన్యం మీ పిల్లలను సేఫ్‌గా చూసుకుంటారనుకోవడం మీ భ్రమే అవుతుంది. ఇందుకు నిదర్శనమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోంది.
వైరల్ అవుతున్న వీడియో బెంగళూరుకు చెందిన ఓ ప్రీ స్కూల్‌కు సంబంధించింది. ఇందులో చిన్న పిల్లలందరినీ ఓ గదిలో వేశారు. అయితే, పిల్లలతో ఉండాల్సిన టీచర్.. వారిని వదిలేసి, రూమ్ డోర్ పెట్టి వెళ్లిపోయారు. ఇంతలో ఓ పిల్లాడు.. మరో చిన్నారిని కొట్టడం మొదలు పెట్టాడు. నాన్ స్టాప్‌గా ఆ చిన్నారిని కొడుతూనే ఉన్నాడు. పదే పదే కొడుతున్నా.. ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పిల్లాడు అత్యంత క్రూరంగా, రాక్షసంగా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే, పిల్లాడి దెబ్బలకు పాప తీవ్రంగా గాయపడగా.. తల్లిదండ్రులు మరుసటి రోజు వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. ఇదేంటని ప్రశ్నించి.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. భయానక దృశ్యం కనిపించింది. పిల్లలను అలా ఎలా వదిలి వేళ్తారని స్కూల్ యాజమాన్యాన్ని బాధిత చిన్నారి అక్షర తల్లిదండ్రులు నిలదీశారు.
తమ బిడ్డను దారుణంగా కొట్టడం చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నానంటూ బోరున విలపించింది. స్కూల్ యాజమన్యంపై నిప్పులు చెరిగింది. తన బిడ్డకు సేఫ్టీ లేదని, ఇలాంటి స్కూల్‌లో తన పిల్లలను ఉంచబోనని ఏడ్చేసింది. ఈ సీసీటీవీ ఫుటేజ్, వారు చెక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. డబ్బు మైకంలో పడి పసి పిల్లలను స్కూల్‌లో వదిలేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇకనైనా తల్లిదండ్రులు మారాలని వేడుకుంటున్నారు. ఇక కొట్టిన పిల్లాడి తల్లిదండ్రులను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఆ పిల్లాడిలో ఇంతటి క్రూరత్వం రావడానికి వారి పెంపకమే కారణం అని దుమ్మెత్తిపోస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వందశాతం ఉందని, ఈ స్కూల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా.. సంపాదన మైకంలో పడి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను వేరొకరిపై వదిలేయడం సరికాదు. ఇతర వ్యక్తులు తమ పిల్లలను సొంత పిల్లాల్లా చూసుకుంటారనుకోవడం భ్రమే అవుతుంది. ఇలాంటి తల్లిదండ్రుల మూలంగానే పుట్టగొడుగుల్లా ప్లే స్కూల్స్ వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా పని చేసే ఈ స్కూళ్లు.. పిల్లల సంరక్షణపై దృష్టి సారించవని ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని అయినా తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యలు అవసరమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం.
గమనిక: అన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటాయని మా ఉద్దేశ్యం కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. చిన్నారి అనుభవించిన నరకం, ఆ తల్లి పడిన వేదనను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
A disturbing video of a preschool where toddlers are left unattended in a closed room. A senior kid is seen hitting repeatedly a junior school. Please think once before sending your’s kids to this kind of School🙏pic.twitter.com/7ovmq7dWn0
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 22, 2023
మర్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..