AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు చలానా వేసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ఫైన్‌ ఎందుకు వేశారో తెలిస్తే, మైండ్‌ బ్లాంకే..

Viral News: సాధారణంగా లైసెన్స్‌ లేకపోతేనో, హెల్మెట్‌ ధరించకపోతేనో వాహనాలకు జరిమానా వేస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారికి పోలీసులు ఫైన్‌ వేస్తాంటారు. ఇది మనందరికీ తెలిసిందే..

Viral News: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు చలానా వేసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. ఫైన్‌ ఎందుకు వేశారో తెలిస్తే, మైండ్‌ బ్లాంకే..
Representative Image
Narender Vaitla
|

Updated on: Jul 28, 2022 | 8:23 AM

Share

Viral News: సాధారణంగా లైసెన్స్‌ లేకపోతేనో, హెల్మెట్‌ ధరించకపోతేనో వాహనాలకు జరిమానా వేస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారికి పోలీసులు ఫైన్‌ వేస్తాంటారు. ఇది మనందరికీ తెలిసిందే.. అయితే కేరళలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు ఫైన్‌ వేసిన ట్రాఫిక్‌ పోలీస్‌ పేర్కొన్న కారణాన్ని చూసిన యజమాని ఫీజులు అవుట్‌ అయ్యాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేరళకు చెందిన బసిల్‌ శ్యామ్‌ అనే వ్యక్తి తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరి వెళ్లాడు.

ఆ సమయంలో బసిల్‌ శ్యామ్‌ వన్‌వేలో రాంగ్‌ రూట్‌లో నడిపాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ బైక్‌ ఆపి రూ. 250 ఫైన్‌ కట్టమన్నాడు. దీంతో బసిల్‌ శ్యామ్‌ ఫైన్‌ మొత్తాన్ని ఇచ్చి, ట్రాఫిక్‌ పోలీస్‌ ఇచ్చిన రిసిప్ట్‌ను తీసుకొని ఆఫీక్‌కు వెళ్లిపోయాడు. తీరా ఆఫీస్‌కు వెళ్లాక రిసిప్ట్‌ చూసిన బసిల్‌ శ్యామ్‌ నోరెళ్లబెట్టాడు. దీనికి కారణం.. బైక్‌లో సరిపడా పెట్రోల్‌ లేని కారణంగా ఫైన్‌ వేసినట్లు ఆ రిసిప్ట్‌లో ఉంది. ఆ రిసిప్ట్‌ను ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ ఫొటో కాస్త నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే సరిపడ ఇంధనం లేకపోతే ఫన్‌ వేయాలన్న నిబంధన ఎక్కడా లేదు.

Kerala

అయితే కేరళ చట్టం ప్రకారం మాత్రం.. బస్సు, కారు, ఆటో వంటి కమర్షియల్‌ వాహనాల్లో సరిపడ డీజిల్‌, పెట్రోల్‌ లేకపోతే ఫైన్‌ వేయొచ్చనే పాయింట్‌ ఉంది. దీనికి కారణం ఇంధనం లేకపోవడం వల్ల వాహనం మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ఈ పాయింట్‌ను జోడించారు. అయితే ఇది బైక్‌లకు వర్తించడదు. ఈ లెక్కన చూస్తే బసిల్‌ శ్యామ్‌కు రాంగ్ రూట్‌కు వేయాల్సిన ఫైన్‌ను ఇలా సరిపడం ఇంధనం లేదని వేసినట్లు అర్థమవుతోంది. దీంతో చలాన్లు వేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్‌ పోలీసులకు అధికారులు సూచనలు జారీ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..