పోలీసులంటే ప్రజలకు రక్షణగా నిలుస్తారు. కానీ కంచే చేను మేసినట్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ దొంగ తనానికి పాల్పడ్డాడు. అది కూడా కక్కుర్తిగా మామిడి పండ్లను చోరీ చేసి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మచ్చ తెచ్చే ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇడుక్కి ఏఆర్ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్.. కంజిరాపల్లిలోని ఓ రోడ్ సైడ్ దుకాణంలో మామిడి పండ్లను చోరీ చేశాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్‌లో పెట్టుకుని వెళ్లిపోయాడు. ఇదంతా సీసీటీపీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. అయితే దొంగ హెల్మెట్, రెయిన్ కోట్ ధరించి ఉండడంతో మొదట అతనిని గుర్తించలేకపోయారు. అయితే బైక్ నంబర్ ఆధారంగా విచారణ చేయిస్తే ఆ మామిడి పండ్ల దొంగను హిహాబ్‌గా గుర్తించారు.
కాగా తన కక్కుర్తి పనితో పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం షిహాబ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. కాగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే షిహాబ్ ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
When @TheKeralaPolice was #caughtoncamera stealing mangoes…
The incident happened in Kanjirappally, Kottayam.
The accused has been identified as PV Shihab, a Civil Police Officer posted at Idukki AR Camp.#CCTV #theft #keralapolice pic.twitter.com/CqT3y8ESID— Bobins Abraham Vayalil (@BobinsAbraham) October 4, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..