Video: కేక్ కటింగ్, పాలాభిషేకం.. విడాకుల తర్వాత ఓ వ్యక్తి వింత సెలబ్రేషన్స్!
కర్ణాటకలో ఓ వ్యక్తి తన విడాకులను అసాధారణంగా సెలబ్రేట్ చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. తల్లి చేత పాల స్నానం చేయించుకుని, 'హ్యాపీ డివోర్స్' కేక్ కట్ చేశాడు. తన మాజీ భార్యకు రూ.1.8 మిలియన్లు నగదు, 120 గ్రాముల బంగారం చెల్లించి స్వేచ్ఛ పొందినట్లు తెలిపాడు.

సాధారణంగా మనమంతా వివాహ వేడుకలు చూశాం. అవి ఎలా చేసుకుంటారో, ఎంత గొప్పగా చేసుకుంటారో కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా విడాకుల వేడుకను చూశారా? చూడలేదా? అయితే ఇప్పుడు చూడండి. కర్ణాటక నుండి వచ్చిన అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది. దీనిలో ఒక వ్యక్తి తన విడాకులను సెలబ్రేట్ చేసుకున్నాడు. అది కూడా మామూలుగా కాదు.. వార్తల్లో నిలిచే రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు.
వీడియోలో విడాకులు పొందిన వ్యక్తికి అతని తల్లి ఆ వ్యక్తిని నేలపై కూర్చోబెట్టి పాలతో స్నానం చేయిస్తున్నట్లు చూడవచ్చు. ఇది సాధారణంగా దేవాలయాలలో నిర్వహించే శుద్ధి కర్మ, కానీ ఇక్కడ కొడుకు విడాకులు తీసుకొని కొత్త జీవితానికి నాంది పలికేందుకు దీనిని నిర్వహించారు. ఆ తర్వాత అందంగా ముస్తాబై.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ కేక్‌పై హ్యాపీ డివోర్స్.. 120 గ్రాముల బంగారం. 1.8 మిలియన్ల రూపాయల నగదు అని అని రాసి ఉంది. దాని అర్థమేంటంటే.. ఆ వ్యక్తి తన మాజీ భార్యకు పరస్పర అంగీకారంతో విడాకులు ఇచ్చానని, ఆమెకు 1.8 మిలియన్ల రూపాయల నగదు, 120 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @iamdkbiradar అనే హ్యాండిల్‌తో షేర్ చేసి.. నేను ఒంటరిగా, సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను అని క్యాప్షన్ ఇచ్చాడు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
