Watch Video: ఆడాళ్లా మజాకా..? జుట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా కొట్టేసుకున్నారు.. వైరలవుతున్న వీడియో

|

May 11, 2024 | 2:41 PM

సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఈ విషయంలో ఝాన్సీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని చాలా మంది వినియోగదారులు పోలీసులను కోరారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు - కూరగాయలు అమ్ముకునే వారి పట్ల పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా..? ప్రభుత్వ సొమ్మును దోచుకునే వారిపై ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోరంటూ మండిపడుతున్నారు.

Watch Video: ఆడాళ్లా మజాకా..? జుట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా కొట్టేసుకున్నారు.. వైరలవుతున్న వీడియో
Jhansi Police Thrashes
Follow us on

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పలువురు వ్యక్తులు గొడవలు పడటం, రోడ్డుపై కొట్టుకోవటం వంటివి కూడా వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఝాన్సీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది మహిళా పోలీసులకు, కూరగాయలు అమ్ముకునే ఓ మహిళకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. పరస్పరం జుట్టు జుట్టూ పట్టుకుని రోడ్డుపైనే కొట్టుకునేందుకు దారితీసింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. దీంతో పాటుగానే పోలీసుల ప్రవర్తన, ప్రజల భద్రతపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ చౌరస్తా వద్ద కూరగాయలు అమ్మే మహిళను కొందరు మహిళా పోలీసులు పట్టుకుని కొట్టడం కనిపించింది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, లేడీ పోలీసులు నలుగురైదుగురు కలిసి ఆమెపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఒక లేడీ పోలీస్‌.. అక్కడున్న కూరగాయల బాస్కెట్‌తో ఆమెను కొట్టింది. అది గమనించిన పక్కనే ఉన్న మరో పోలీస్‌ అధికారి వారి మధ్యలో జోక్యం చేసుకోవడం కనిపిస్తుంది. ఇదంతా అక్కడున్న కొందరు వీడియోలు తీస్తున్నారు. చాలా మంది పట్టి పట్టనట్టుగా చూస్తూ వెళ్లిపోతున్నారు. శుభం అనే యూజర్ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో ఈ గొడవ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీనిపై స్పందించారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లపై ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఈ విషయంలో ఝాన్సీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని చాలా మంది వినియోగదారులు పోలీసులను కోరారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – కూరగాయలు అమ్మేవారి పట్ల పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా..? ప్రభుత్వ సొమ్మును దోచుకునే వారిపై ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోరంటూ మండిపడుతున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో బండిపై కూరగాయలు అమ్ముతున్న మహిళలపై మున్సిపల్ కార్పొరేషన్ మహిళా భద్రతా సిబ్బంది దాడి చేసిన వీడియో తమ దృష్టికి వచ్చిందని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. సిప్రీ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..