AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌…కొత్త రికార్డు కోసం కృషి చేస్తున్న 36ఏళ్ల వ్యక్తి..?!

అతను కెరీయర్‌లో ఎవరూ ఊహించని వినూత్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం గత పదేళ్లుగా అతడు ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీలైనంత మందిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నలుగురు అమ్మాయిల్ని పెళ్లి చేస్తున్నాడు. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంతేకాదు.. సదరు వ్యక్తి సొంత ఖర్చుల కోసం

Viral News: నలుగురు భార్యలు, ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌...కొత్త రికార్డు కోసం కృషి చేస్తున్న 36ఏళ్ల వ్యక్తి..?!
Unemployed Japanese Man
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2024 | 7:13 AM

Share

చాలా మంది చిన్నకుటుంబం, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాడు. అతనికి నలుగురు భార్యలు ఉన్నప్పటికీ, అది అతనికి సంతృప్తి కలిగించలేదట. దీంతో అతను మరో ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ని కూడా మెయింటెన్‌ చేస్తున్నాడు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సదరు వ్యక్తి ఐదు పైసాల సంపాదించే పని కూడా చేయడట..! పైగా అతను ఏదో రికార్డు సృష్టించాలనుకుంటున్నాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ స్టోరీ జపాన్‌కు చెందిన 36 ఏళ్ల ర్యూతా వతనాబే అనే వ్యక్తికి సంబంధించినది. అతని జీవితం లక్ష్యం వింటే ముక్కున వేలేసుకుంటారు.. అతను కెరీయర్‌లో ఎవరూ ఊహించని వినూత్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇందుకోసం గత పదేళ్లుగా అతడు ఏ ఉద్యోగమూ చేయడం లేదు. వీలైనంత మందిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు నలుగురు అమ్మాయిల్ని పెళ్లి చేస్తున్నాడు. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అంతేకాదు.. సదరు వ్యక్తి సొంత ఖర్చుల కోసం కావాల్సిన డబ్బు కోసం కూడా అతడు భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌పైనే ఆధారపడుతున్నాడు. వారి సంపాదనపైనే తనకు నచ్చిన జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఇకపోతే, తాను మొత్తం 54 మంది పిల్లలకు తండ్రిని కావాలని వతనాబే కోరుకుంటున్నాడు. ఇప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గురు భార్యలతో కలిసి నివసిస్తున్నాడు. హౌస్‌వైఫ్ మాదిరిగా ‘హౌస్ హస్బెండ్’ పాత్రను పోషిస్తున్నాడు. ఇంట్లో వంట చేయడం, ఇంటి పనులు చక్కబెట్టడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. అసాధారణ రీతిలో పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని అతడు కలలు కంటున్నట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. భార్యలు అందరూ వతనాబేను ఉమ్మడి భాగస్వామిగా భావిస్తున్నారని తెలిపింది. పెళ్లికి సంబంధించి ఎలాంటి లాంఛనప్రాయ నమోదు లేకుండానే కలిసి ఉంటున్నారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కాగా వతనాబే ఇంటి ఖర్చులు నెలకు సుమారు 914,000 యెన్లు ( దాదాపు రూ.5 లక్షలు) అవుతుండగా అతని భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ సమానంగా భరిస్తున్నారు. కాగా వతనాబేకి నాలుగవ భార్య కూడా ఉండేది. కానీ,అనూహ్యంగా ఆమె అతని నుండి విడిపోయారట.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి