కొన్ని కొన్ని దృశ్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. పైకి చూడటానికి ఒకలా కనిపిస్తూ.. టచ్ చేస్తే చాలు సీన్ వేరేలా ఉంటుంది. అలాంటి షాకింగ్ విజువల్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా సైతం సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగానే మిడతలు ప్రకృతి రంగులో కలిసిపోయేలా ఉంటాయి. చెట్లు, చెట్ల బెరడు మాదిరిగా ఉంటాయి. ఆ మిడతలు.. చెట్లపై వాలితే అవి అక్కడ ఉన్నాయో లేదో కూడా గుర్తుపట్టనంతగా పరిస్థితి ఉంటుంది. అలాంటి స్టన్నింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఐపీఎస్ అధికారిని స్వాతి లక్రా షేర్ చేశారు.
ఈ వీడియోలో ఓ కట్టెకు బెరడు మాదిరిగా ఉంది. దానిని తీసేందుకు ప్రయత్నించగా.. అది కదులుతోంది. ఏంటా అని పరిశీలిస్తే గానీ తెలియలేదు. అది అటూ ఇటూ కదులుతూ షాక్‌కు గురి చేసింది. కట్టెను అంటిపెట్టుకుని ఉన్నది ఒక మిడతగా గుర్తించారు. కర్ర బెరడు మాదిరిగా కలిసిపోయిన ఈ మిడతను చూసి నిజంగా ఆశ్చర్యపోయారు. అది కర్రను బిగ్గరగా పట్టుకోగా.. దానిని కదిలించారు. దాంతో అది ముందుకు కదిలింది. అలా అది బెరడు కాదు.. ఆ ఆకారంలో ఉన్న ఒక జీవి అని అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.
CAPTION THIS
The camouflage…..
Nature never fails to surprise me…..#nature #awesome pic.twitter.com/1lcTs6yEcU— Swati Lakra (@SwatiLakra_IPS) December 22, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..