AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేందయా ఇదీ.. ఇదేం వింత.. ఉన్నచోటనే మాయమైపోతున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..

వ్యక్తులు తాము ఉన్న చోటనే మాయం అవడం ఎప్పుడైనా చూశారా?.. సినిమాల్లో చూశామని బదులివ్వకండి. ఎందుకంటే.. సినిమాల్లో అందరూ చూసిన ముచ్చటే ఇది. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటిది..

Viral Video: ఇదేందయా ఇదీ.. ఇదేం వింత.. ఉన్నచోటనే మాయమైపోతున్న యువతి.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..
Invisible
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2022 | 6:06 AM

Share

వ్యక్తులు తాము ఉన్న చోటనే మాయం అవడం ఎప్పుడైనా చూశారా?.. సినిమాల్లో చూశామని బదులివ్వకండి. ఎందుకంటే.. సినిమాల్లో అందరూ చూసిన ముచ్చటే ఇది. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటిది ఉంటుందని, వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? అవును, మీరు చదివేది అక్షరాలా నిజం. ఓ అమ్మాయి ఉన్నట్లుండి మాయం అవుతుంది. దానికి కారణం ఓ క్లాత్. దానితో కవర్ చేసుకుంటే చాలు.. కనిపించకుండా మాయమైపోతోంది యువతి. పాత సినిమాల్లో అబ్రదకదబ్ర అనగానే మాయం అయినట్లు.. ఈ యువతి కూడా తనకు అడ్డుగా క్లాత్ పెట్టగానే మాయమైపోతోంది. ఆ క్లాత్ ఉన్నంత వరకు ఆమె కనిపించడం లేదు. ఎప్పుడైతే ఆ క్లాత్ తీసేస్తుందో.. అప్పుడు మళ్లీ కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

Learn Something New పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువతి.. తన రెండు చేతులతో ఒక ఇన్‌విజబుల్ క్లాత్‌ను పట్టుకుంది. ఆ పక్కనే మరికొందరు క్యాబిన్‌లో ఉన్నారు. అయితే, ఈ వింత క్లాత్‌ను పట్టుకున్న అమ్మాయి.. దానితో తనను తాను కవర్ చేసుకుంది. ఎంత వరకు కవర్ చేసుకుంటే.. అంత వరకు ఆమె కనిపించకుండాపోతోంది. అదే సమయంలో పూర్తిగా కవర్ చేసుకుంటే.. పూర్తిగా మాయమైపోతోంది. చూడటానికి చాలా విచిత్రంగా ఉంది.

ఈ వీడియోను శుక్రవారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. విపరీతంగా వైరల్ అవుతోంది. షేర్ చేసిన కొద్ది గంటల్లో 4 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్, రీట్వీట్స్ చేయడం జరిగింది. ఈ వింత చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు? ఇది నిజంగా నిజమేనా? లేక ఎడిటింగ్ ఎఫెక్టా? అని సందిగ్ధంలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోను మీరూ ఓసారి చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్