AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th class Students: సార్‌.. నా ప్రేమ మీ చేతిలోనే ఉంది..! పైసల్‌ తీసుకోండి.. పాస్‌ చేయండి..!! పదో తరగతి విద్యార్థి రాసిన..

10వ తరగతి పరీక్ష మార్చి 3 నుండి మార్చి 26 వరకు జరిగాయి.. ఈ పరీక్షకు 4.27 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే పదో తరగతి పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరుకున్న సమయంలో,విద్యార్థుల వింత డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి.

10th class Students: సార్‌.. నా ప్రేమ మీ చేతిలోనే ఉంది..! పైసల్‌ తీసుకోండి.. పాస్‌ చేయండి..!! పదో తరగతి విద్యార్థి రాసిన..
Karnataka Students
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2025 | 6:48 PM

Share

Karnataka : దేశవ్యాప్తంగా చాలా వరకు విద్యార్థులకు 10వ తరగతి , ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక అందరూ రిజల్ట్స్‌ కోసం ఎదురు చూస్తు్న్నారు. ఇకపోతే, పదో తరగతి అంటేనే.. ప్రతీ విద్యార్థి జీవితంలో తొలి మైలురాయి. దీనిని అధిగమించేందుకు విద్యార్థులు కష్టపడి చదువుతారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం చదవలేక కాపీ కొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఉపాధ్యాయులను, పరీక్ష పత్రాలు దిద్దే వారిని కాకపట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మరికొందరు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబు పత్రాలపై వింత వింత సమాధానాలు రాస్తుంటారు. కొందరు సినిమా పాటలు రాస్తుంటారు. మరికొందరు ఇష్టదైవాల పేర్లు కూడా రాస్తుంటారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ విద్యార్థులు ఏకంగా తమను పాస్‌ చేయాలంటూ లంచం ఆఫర్‌ చేశారు.

అవును మీరు చదివింది నిజమే.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడిలో (SSLC)10వ తరగతి పరీక్షల సమాధాన పత్రాలలో ఉపాధ్యాయులకు వింత సమాధానాలు కనిపించాయి. 10వ తరగతి పరీక్ష సమాధాన పత్రంలో కనిపించింది చూసి వారంతా షాక్ అయ్యారు. విద్యార్థులను పాస్‌ చేయడానికి ఉపాధ్యాయులకు డబ్బు ఆఫర్ చేశారు. విద్యార్థుల డిమాండ్లు రూ. 500లతో జతపర్చిన జవాబు పత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలో 10వ తరగతి పరీక్ష మార్చి 3 నుండి మార్చి 26 వరకు జరిగాయి.. ఈ పరీక్షకు 4.27 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే పదో తరగతి పరీక్షల మూల్యాంకనం చివరి దశకు చేరుకున్న సమయంలో,విద్యార్థుల వింత డిమాండ్లు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

పరీక్షలో సమాధానాలకు బదులుగా కొందరు విద్యార్థులు ఇలా రాశారు..‘‘సార్, దయచేసి నన్ను పాస్‌ చేయండి, ఈ రూ.500 తీసుకోండి’’, ‘‘నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది’’, ‘‘పాస్‌ చేయకపోతే తల్లిదండ్రులు కాలేజీకి పంపరు’’ వంటి అభ్యర్థనలు రాశారు.

మరో విద్యార్థి వింతగా.. ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని, ‘నేను పాసైతేనే నా ప్రేమను కొనసాగిస్తాను’ అంటూ తన సమాధాన పత్రంలో రాయడం సోషల్‌ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక ఆన్సర్‌ షీట్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాక, విద్యార్థుల మనస్తత్వం, పరీక్షల ఒత్తిడిపై చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై