- Telugu News Photo Gallery Water rich fruits for summer to prevent heatwave and keep body cool hydrated
Summer Fruits: వేసవిలో ఆరోగ్యం కోసం తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే.. ఎందుకంటే?
వేసవి భగ్గుమంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఈ సీజన్‌లో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఉదయం 7గంటలు నుండే సూర్యుడు నిప్పులు చిమ్మడం ప్రారంభిస్తాడు. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టగానే, వేడి గాలులు, చెమట శరీరం నుండి నీళ్లన్నింటినీ బయటకు లాగుతాయి. దీంతో అలసట, తలతిరగడం, నిర్జలీకరణం వంటి సమస్యలు సర్వసాధారణం అవుతాయి. దీనికి కేవలం నీళ్లు తాగితే సరిపోదు, మన ఆహారంలో నీరు పుష్కలంగా ఉండే పండ్లను చేర్చుకోవాలి. వేసవి కాలంలో శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం అత్యంత అవసరం. అందుకే, హైడ్రేషన్ కోసం కొన్ని ప్రత్యేకమైన పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
Updated on: Apr 20, 2025 | 5:41 PM

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది. కానీ, పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగటం మాత్రం అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

కర్బూజ: దాదాపు 90 శాతం వరకు నీటితో కూడిన ఈ పండు మంచి ఫైబర్ సోర్స్ కూడా. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది మరియు మరబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయలో నీరు కూడా పుష్కలంగా ఉంటుంది. వేడిలో ఉపశమనం ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి లతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేడి వల్ల కలిగే చికాకును తగ్గిస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారంలో తీసుకుంటే చాలా మంచిది.

పనసపండు: వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనసపండు ఒకటి. పనస పండులో సుమారు 76 శాతం వరకు నీరు ఉంటుంది.ఇది బీ-కాంప్లెక్స్ విటమిన్లకు మంచి మూలం. శక్తిని ఇస్తూ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ ను సమృద్దిగా కలిగి ఉంది.

జామకాయ: ఇందులో 80 శాతం వరకు నీరు ఉంటుంది. అదేవిధంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలూ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఉత్తమ ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. జామకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి జామకాయలు చేసే మేలు అంతా ఇంతా కదు. ఈ కాయలు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. పైగా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరచడంలో జామకాయలు ఎంతో ఉపయోగపడతాయి.

నారింజ: నారింజ రుచిలో రుచికరమైనది మాత్రమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా అలసట, నీరసం కూడా తొలగిపోతుంది. నారింజ రసం తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. నిర్జలీకరణం కూడా జరగదు.




