Viral: 42గంటలు ప్రయాణించాల్సిన రైలు.. మూడేళ్లకు స్టేషన్‌ చేరింది.. కంటైనర్‌ తెరిచి చూడగా

|

Dec 09, 2024 | 1:39 PM

ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేలోపే అదృశ్యమైంది. ఎటు వెళ్లిందో.. ఎక్కడ మిస్సింగ్ అయిందో తెలియదు. 42 గంటల్లో గమ్యస్థానానికి చేరాల్సిన రైలు.. రావడానికి మూడేళ్లు పట్టింది. ఇంతకీ అదేంటంటే..

Viral: 42గంటలు ప్రయాణించాల్సిన రైలు.. మూడేళ్లకు స్టేషన్‌ చేరింది.. కంటైనర్‌ తెరిచి చూడగా
Representative Image
Follow us on

సాధారణంగా ఓ రైలు పది లేదా పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుంది. లేదా మరేదైనా కారణంగా ఒక రోజు ఆలస్యం కావచ్చు. కానీ ఇక్కడ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు.. సరిగ్గా 3 సంవత్సరాలుకు చేరుకుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది. 2014వ సంవత్సరం నవంబర్‌లో విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ స్టేషన్‌కి చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది. 1,400 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల ప్రయాణం పడుతుంది. కానీ ఈ రైలు ఆలస్యానికి కారణం..

ఇది చదవండి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. బాబోయ్.! ఏపీకి మళ్లీ వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్

రైలులో 14 లక్షల రూపాయల విలువైన 1,361 ఎరువుల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా డెలివరీ కోసం బుక్ చేసుకున్నారు. అయితే 2014 నవంబర్‌లో అనుకున్న విధంగా రైలు గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో అనుమానమొచ్చి గుప్తా.. రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ఎక్కడుందా అనే జాడ కూడా ఎవ్వరికీ తెలియలేదు.

ఇలా ఇన్వెస్టిగేషన్ కొన్నేళ్లు సాగింది. అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత రైలు 2018 జూలైలో బస్తీ స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికి ఎరువు పనికిరాకుండా పోయింది. విచారణ జరిగినప్పటికీ, రైలు ఎందుకు ఆలస్యమైంది, ఎలా అదృశ్యమైంది అనే దానిపై స్పష్టత లేదు. కాగా, ఈ సంఘటన భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత షాక్‌తో కూడుకున్నది. ఈ ఘటన రైల్వే వ్యవస్థలోని సవాళ్లను హైలైట్ చేసింది.

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..