
ఆటలు, క్రీడలు మన శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాక మన శరీరం దృఢంగా ఉండడానికిి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రమాదవశాత్తు ఆటలు ఆడతూ నెలకొరిగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన పలు వీడియోలను కూడా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. అయితే పోయిన వారం చివరలో భారత సంతతికి చెందిన మస్కట్ దేశస్థుడి విషయంలో కూడా జరిగింది. బ్యాడ్మింటన్ గేమ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆ వ్యక్తి స్పోర్ట్స్ కోర్టులో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అతడు ఒక్కసారిగా కిందపడిపోవడంతో నరేంద్ర నాథ్ మిశ్రా అనే జర్నలిస్ట్ ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోను తన ట్వీట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. దీంతో ఆ షాకింగ్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.