Viral: ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషింగ్‌ మిషిన్‌.. ఎలా పనిచేస్తుందో చూడండి..

ఇండియాకు చెందిన ఓ ఇంజనీర్ ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషింగ్ మిషన్ ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మిషిన్ ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ వాషింగ్ మిషన్ కు తయారీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వాషింగ్ మిషిన్ ను ఎలా తయారు చేశారు.? ఇది ఎలా పని చేస్తుందో చూసేయండి..

Viral: ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషింగ్‌ మిషిన్‌.. ఎలా పనిచేస్తుందో చూడండి..
Small Washing Machine
Follow us

|

Updated on: Oct 17, 2024 | 11:09 AM

నలుగురు చేయని పనిని చేస్తేనే ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇలా వెరైటీగా కొత్త పనులు చేసిన వారిని గౌరవిస్తుంది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు చేసే వినూత్న పనులను ప్రపంచాన్ని పరిచయం చేయడమే గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ పని. ఇలా ప్రతీ రోజూ ఎన్నో వింతలు మనకు పరిచయం అవుతుంటాయి.

తాజాగా ఇలాంటి ఓ అంశమే గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. భారతీయ ఇంజనీర్‌ సెబిన్‌ సాజీ చేసిన ఓ పని అతన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునేలా చేసింది. ఇంతకీ అతను సాధించింది ఏంటనేగా.. ప్రపంచంలోనే అత్యంత చిన్న వాషించి మిషన్‌ను రూపొందించాడు సెబిన్‌. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం.

ఒర రకంగా చెప్పాలంటే ఇది చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే ఇది అచ్చంగా నిజమైన వాషింగ్ మిషిన్‌లాగే పనిచేస్తుండడం విశేషం. ఇది ఎలా పనిచేస్తుందో వివరిస్తూ రూపొందించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వాషింగ్ మిషన్‌లో మొదట ఒక చిన్న క్లాత్‌ ముక్కను వేశాడు.

ఆ తర్వాత అందులో నీటిని పోసి, డటర్జెంట్ వేశాడు. ఆ తర్వాత ఆన్‌ చేయగానే లోపల ఉన్న గుడ్డ ముక్క తిరగడం మొదలైంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే. వాషింగ్‌ అయిన తర్వాత నీరు బయటకు వెళ్లడం మరో విశేషం. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్‌ మెషీన్‌లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..