UP Cops Naagin Dance: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేడుకల్లో ఇద్దరు యూపీ పోలీసులు అనుచితంగా నాగిని డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో.. పోలీసుల తీరుపై దీంతో నెటిజన్లు మండిపడటంతో ఉత్తరప్రదేశ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఘటన ఆగస్టు 15న ఫిలిబిత్‌లోని పురాణాపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. అనంతరం నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. పోలీసు దుస్తుల్లోనే వారు డ్యాన్స్ చేస్తుండగా.. మరికొందరు వారిని ఉత్సహపరుస్తూ కనిపించారు. కాగా.. వీరి డ్యాన్స్ వివాదాస్పదంగా మారింది. ఇండిపెండెన్స్ డే రోజున సంబంధంలేని పాటకు డ్యాన్స్ చేయడమేంటంటూ నెటిజన్లు మండిపడ్డారు.
వీడియో..
जब दारोगा जी बने सपेरा, नागिन कांस्टेबल को अपनी बीन पर नचाया।? pic.twitter.com/eVHCx3hJgo
— Jaiky Yadav (@JaikyYadav16) August 16, 2022
దీంతో అధికారులు వారిద్దరినీ పిలిచి హెచ్చరించారు. అయితే కొందరు వారు తాగున్నారంటూ పేర్కొనగా.. వారు మద్యం తాగలేదని.. కానీ యూనిఫామ్‌లో అలా చేయడం వల్ల చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ దినేశ్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..