
ట్రెండ్ కి తగ్గట్లు వాహనదారులకు అవగాహన కల్పించడంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. ఎప్పుడు ఏ కొత్త అంశం ట్రెండింగ్‌లోకి వచ్చినా దానికి తగట్టు వారి క్రియేటివిటీని ఉపయోగించి వీడియోలు క్రియేట్ చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్‌ను వినియోగించుకొని ఓ కొత్త అవగాహాన విడియోను రూపొందించారు. ఇప్పటికే ‘సలార్’ సినిమాలోని డైలాగ్‌లతో న్యూ ఇయర్ సందర్బంగా సందేశాత్మక వీడియో విడుదల చేసిన పోలీసులు.. తాజాగా ‘రాజాసాబ్’ మూవీలోని ప్రభాస్ డైలాగ్‌లతో మరో ఆసక్తికర అవగాహన వీడియో క్రియేట్ చేసి వాహనదారుల్లో ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
#HYDTPweBringAwareness
📢ℋℯ𝓁𝓁ℴ… ℋℯ𝓁𝓁ℴ….!
బండి కొంచెం మెల్లగా #𝕯𝖗𝖎𝖛𝖊 చేయండి డార్లింగ్❤️𝖉𝖆𝖗𝖑𝖎𝖓𝖌.
🏍️#WearHelmet#DarlingPrabhas #TheRajaSaab pic.twitter.com/OHSeM6kd1D— Hyderabad Traffic Police (@HYDTP) June 17, 2025
రాజా సాబ్ టీజర్‌లోని హలో బండి… కొంచెం మెల్లగా… అసలే మన లైఫ్ అంతంత మాత్రం!” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్‌తో ఓ వీడియో క్రియేట్ చేసి యూత్‌కు మెసేజ్ ఇస్తున్నారు. పోలీసులు క్రియేట్ చేసిన వీడియోలో గతంలో ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ లోని ‘ఇట్స్ షో టైమ్’అనే డైలాగ్‌తో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రభాస్ బైక్‌పై రయ్ మంటూ వెళ్లే సీన్ వస్తుంది.. ఆ వెంటనే ‘రాజాసాబ్’లోని హలో బండి కొంచెం మెల్లగా డ్రైవ్ చేయమనే డైలాగ్‌ను వస్తుంది. ఇది ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిలో అవగాహణ కల్పించే విదంగా ఉండగా.. ఆ తర్వాత ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద నెమ్మదిగా వస్తున్న విజువల్స్ యాడ్ చేశారు. ఇక చివర్లో ప్రభాస్ హెల్మెట్ తీసే సీన్‌కి ‘మన లైఫ్ ఎంతో విలువైనది’ అనే క్యాప్షన్‌ను యాడ్ చేసి మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తమ అభిమాన హీరో డైలాగ్‌తో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్రియేట్ చేసిన వీడియోను ఫ్యాన్ తెగవైరల్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..