Hyderabad: ఉదయాన్నే కారులో వచ్చారు.. నడిరోడ్డుపై బరితెగించారు.. అటుగా వెళ్తున్న పెద్దోళ్లు చూసి..!

|

May 24, 2024 | 2:18 PM

మందుబాబుల బరితెగింపు ఇది. తెల్లవారినాసరే, వీళ్ల మత్తు దిగలేదు. జనం చూస్తన్నారన్న సిగ్గు కూడా లేదు. రాత్రికి తోడు పొద్దేన్నే బీరు బాటిళ్ళు పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్‌ ఫతుల్లగూడ దగ్గర్లో ఒక యువతి, ఒక యువకుడు పట్ట పగలు హల్‌చల్‌ చేశారు.

Hyderabad: ఉదయాన్నే కారులో వచ్చారు.. నడిరోడ్డుపై బరితెగించారు.. అటుగా వెళ్తున్న పెద్దోళ్లు చూసి..!
Drunken Youths Rioted
Follow us on

మందుబాబుల బరితెగింపు ఇది. తెల్లవారినాసరే, వీళ్ల మత్తు దిగలేదు. జనం చూస్తన్నారన్న సిగ్గు కూడా లేదు. రాత్రికి తోడు పొద్దేన్నే బీరు బాటిళ్ళు పట్టుకుని రోడ్లపైకి వచ్చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్‌ ఫతుల్లగూడ దగ్గర్లో ఒక యువతి, ఒక యువకుడు పట్ట పగలు హల్‌చల్‌ చేశారు. ఉదయం ఆరుగంటలకు బీరు తాగుతూ వాకర్స్‌తో గొడవకు దిగారు.

బహిరంగంగా బీరు బాటిల్‌తో ఉన్న యువతీ యువకులను చూసిన స్థానికులు.. వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరూ వారిపై విరుచుకుపడ్డారు. అందరూ చూస్తుండగానే అసభ్య పదజాలంతో ఎదురు దాడి చేశారు. యువతి పెద్దా చిన్నా తేడా లేకుండా వాకర్స్‌పై రెచ్చిపోయారు. ఆ సమయంలో వాకింగ్‌కు వెళుతున్న వారితో వాగ్వాదానికి దిగారు. పైగా వారికి బూతులు తిట్టారు. బీరు బాటిల్స్‌ పట్టుకుని, కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. తాము ఏం చేస్తున్నామో, ఎవరి ఏం మాట్లాడుతున్నామో అన్న స్పృహ లేకుండా ప్రవర్తించారు.

ఇందుకు సంబంధించి స్థానికులు వీడియో చిత్రీకరించడంతో వారిపై రుసరుసలాడింది ఆ యువతి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి..

మీరూ ఈ వీడియో చూసేయండి..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..