ప్రియురాలితో భార్యకు అడ్డంగా దొరికిన భర్త.. రోడ్డుపై హై-వోల్టేజ్ డ్రామా.. చోద్యం చూసిన పోలీసులు

కొంత కాలం క్రితం వరకూ ఇల్లాలు, ప్రియురాలు సన్నివేశాలు సినిమాల్లో, సీరియల్స్ లోనో కనిపించేవి. కథల్లో వినిపించేవి. అయితే ఇప్పుడు వంటి సన్నివేశాలు రియల్ లైఫ్ లో తరచుగా కనిపిస్తూ.. ఫ్యామిలీ హై-వోల్టేజ్ డ్రామా జరుగుతూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇటువంటి సంఘటన యుపీలోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక హోటల్ వెలుపల భర్త, భార్య, భర్త స్నేహితురాలి మధ్య తీవ్ర గొడవ జరిగింది. రోడ్డుపై దాదాపు గంటసేపు హై-వోల్టేజ్ డ్రామా జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది

ప్రియురాలితో భార్యకు అడ్డంగా దొరికిన భర్త..  రోడ్డుపై హై-వోల్టేజ్ డ్రామా.. చోద్యం చూసిన పోలీసులు
Viral Video

Updated on: Oct 08, 2025 | 3:02 PM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఒక హై-వోల్టేజ్ కుటుంబ నాటకానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. అందులో ఒక మహిళ తన భర్త, అతని స్నేహితురాలిపై దాడి చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు చేసింది. మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నార్వాల్ మోడ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక హోటల్ వెలుపల భర్త, భార్య, భర్త స్నేహితురాలు అని చెప్పుకునే యువతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ హై-వోల్టేజ్ డ్రామా దాదాపు గంటసేపు కొనసాగింది.

మహారాజ్‌పూర్‌లోని ఒక గ్రామానికి చెందిన ఒక మహిళ తనకు 2018లో వివాహం అయిందని.. ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పింది. రాజ్‌కోట్‌లో నివసించే ఆమె భర్త దీపావళికి రెండు రోజుల ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. మంగళవారం ఉదయం అతను తన ప్రియురాలిని కలవడానికి నార్వాల్ మోర్‌లోని ఒక హోటల్‌కు వెళ్లాడు. అనుమానంతో భార్య కూడా భర్తను అనుసరిస్తూ హోటల్‌కు వెళ్లింది. తన భర్త తన ప్రియురాలితో చేయి చేయి కలిపి హోటల్ నుంచి బయటకు రావడం భార్య చూసింది. దీంతో భార్యకు కోపం వచ్చింది.

వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

తన భర్త గత మూడు సంవత్సరాలుగా ఆ మహిళతో సంబంధంలో ఉన్నాడని.. గతంలో చాలాసార్లు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని భార్య ఆరోపించింది. హోటల్ వెలుపల, రెండు వర్గాల మధ్య జరిగిన మాటల వాగ్వాదం తర్వాత శారీరక ఘర్షణగా మారింది. భార్య .. భర్త ప్రియురాలిని కొట్టడమే కాదు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన తన భర్తను కూడా చెంపదెబ్బ కొట్టింది. దీని తర్వాత ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు.. వీధిలో జరిగిన గొడవను చూడటానికి దారిలో వెళ్ళేవారంతా గుంపుగా పోగయ్యారు. కొందరు ఈ సంఘటనను వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

 

చోద్యం చూసిన పోలీసులు

ఆశ్చర్యకరంగా సంఘటన స్థలంలో ఉన్న పోలీసు అధికారులు మౌనంగా ఉండిపోయారు. దాదాపు గంటసేపు గొడవ జరిగిన తర్వాత.. అటుగా వెళ్తున్న వ్యక్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేసి భర్తను అక్కడి పంపించి వేశారు. ఈ విషయంలో తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోపై దర్యాప్తు జరుగుతోంది. ఫిర్యాదు అందితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..