Viral Video: కాస్త దట్టంగా మబ్బులు పట్టి, చీకటిగా ఉండి వర్షం పడేతేనే ఆగమాగం అవుతాం. అలాంటిది ఒక ప్రళయంలా, మరేమీ కనిపించకుండా మబ్బులు కమ్మేస్తే.. పరిస్థితి ఏంటి? అవును.. మబ్బులు సముద్రపు అలల మాదిరిగా, తుపాను మాదిరిగా దూసుకొచ్చాయి. వినీలాకాశం నుంచి భూమి ఉపరితలాన్ని సైతం పూర్తిగా కప్పేస్తూ సముద్రపు రాకసి అలల మాదిరిగా దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోలో ఓ కొండ ప్రాంతంలో రోడ్డు, ఇళ్లు ఉన్నాయి. ఇళ్లకు కూతవేటు దూరంలో భారీ సైజులో ఉన్న మబ్బులు కమ్ముకొస్తున్నాయి. అవి దూసుకొస్తున్న తీరు ఒక ప్రళయం ముంచుకొస్తున్నట్లుగా, సునామీ సందర్భంలో ఎగసిపడే అలల మాదిరిగా ఉంది దృశ్యం. మబ్బుల భీకర దృశ్యాలను కొందరు తమ ఫోన్ కెమెరాల్లో బందించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. ఇంతటి భయానకమైన మబ్బులను తామెన్నడూ చూడలేదని, ప్రకృతి భయపెడితే ఎవరూ తట్టుకోలేరని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ విజువల్స్‌ను చూసేయండి.
Cloud Waterfall. ?⛅pic.twitter.com/jSNcJDRGWr
— Cosmic Gaia (@CosmicGaiaX) September 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..