Tips to kill Ants: ఇంట్లో చీమల బెడదా..? ఈజీగా తరిమికొట్టే చిట్కాలు ఇవే..!

|

Sep 13, 2024 | 5:27 PM

అందుకే పంచదార డబ్బా ఉన్న చోట లేదా చీమలు వచ్చే చోట గీత గీస్తే చీమల బెడద తప్పుతుంది. లేదా పంచదార డబ్బా పెట్టే చోట గుండ్రంగా రాసి అందులో పంచదార డబ్బా పెట్టాలి. ఆ వాటర్​చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్​లో పోసి చీమలపై స్ప్రే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

Tips to kill Ants: ఇంట్లో చీమల బెడదా..? ఈజీగా తరిమికొట్టే చిట్కాలు ఇవే..!
Ants
Follow us on

వంటగది అనేది ఆ ఇంటి గుండెకాయ వంటిది.. ఎందుకంటే వంటగదిలో అన్నీ సరిగ్గా ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. గృహిణులకు వంటింటి వస్తువులను మెయింటెయిన్ చేయడం సవాలుతో కూడుకున్న పని. వంటగదిలో చాలా పని ఉంటుంది.. కాబట్టి, పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. వంటగదిలోని వస్తువులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, అవి పాడవకుండా చూసుకోవడం, పురుగులు పట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, కిచెన్‌లో స్వీట్లు, మసాలా దినుసులు, పాచిపోయిన ఆహారం నిల్వ ఉండటం వల్ల, లేదంటే, కిందపడిపోయి ఉండటం వల్ల ఈ కిచెన్ చీమలకు కూడా ఇష్టమైన ప్రదేశంగా మారుతుంది.

ముఖ్యంగా ఇంట్లో పంచదార డబ్బా, బెల్లం బాక్స్‌ ఉంటే చీమలు పట్టడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఎంత ఎత్తులో పెట్టినా, మూత ఎంత గట్టిగా బిగించినా ఈ చీమలు ఆ డబ్బాల్లోకి దూరుతుంటాయి. చీమలను తరిమికొట్టి స్థలం మార్చినా ఆ మర్నాడు ఉదయాని కల్లా చీమలు పుట్టలుగా చేరిపోతాయి. ఇది కొన్నిసార్లు చికాకుకు దారితీస్తుంది. చక్కెరను ఉపయోగించే ముందు, చీమలను వదిలించుకోవడం పెద్ద పనిగా మారుతుంది. ఇది పనిని పెంచడమే కాకుండా మరింత పని ఆలస్యానికి కారణం అవుతుంది. కాబట్టి ఇంట్లో చీమలను ఎలా నివారించాలి? చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఎలా నిరోధించాలో ఇక్కడ తెలుసుకుందాం.

సుద్ద ముక్క.. అవును స్కూల్లో బ్లాక్‌బోర్డ్‌పై రాయడానికి ఉపయోగించే ఈ చాక్ పీస్ మీ ఇంట్లో చీమల సమస్యను పరిష్కరిస్తుంది. ఈ చాక్ పీస్ చీమలకు విషపూరితమైన కాల్షియం కార్బోనేట్‌ను కలిగి ఉంటుంది. అందుకే పంచదార డబ్బా ఉన్న చోట లేదా చీమలు వచ్చే చోట గీత గీస్తే చీమల బెడద తప్పుతుంది. లేదా పంచదార డబ్బా పెట్టే చోట గుండ్రంగా రాసి అందులో పంచదార డబ్బా పెట్టాలి.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం.. చీమలు నిమ్మరసం వాసన కూడా చూడలేవు. ఈ నిమ్మకాయ తొక్క తీసి చీమల గూడులో లేదా అవి ఎక్కడ ఎక్కువగా వస్తున్నాయో అక్కడ నిమ్మరసాన్ని స్ప్రెబాటిల్‌లో వేసి పిచికారీ చేస్తే చీమల బెడద తగ్గుతుంది. పొడి ఉప్పు లేదా రాతి ఉప్పు వేడి నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని సీసాలో వేసి చీమల గూడు లేదా అవి వచ్చే చోట స్ప్రే చేస్తే ఖచ్చితంగా చీమల బెడద పోతుంది.

పసుపు, నల్ల మిరియాలతో కూడా చీమల సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో టీస్పూన్​ పసుపు, కొన్ని నల్ల మిరియాలు వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్​లో పోసుకుని కిచెన్​లోని అన్ని మూలల్లో, ఆహార పదార్థాలను పెట్టే చోట స్ప్రే చేసుకోవాలి. ఇలా చేస్తే చీమలు రాకుండా అడ్డుకోవచ్చు.

పుదీనా.. మీ ఇంట్లో పుదీనా మొక్కలు ఉన్నట్టయితే.. ఆ కుండీ లేదంటే.. ఈ ఆకులను వంటింట్లో చీమలు వచ్చే చోట పెడితే చాలు దాని వాసన వల్ల వంటగదిలోకి చీమలు రాకుండా ఉంటాయి. లేదంటే.. కొన్ని పుదీనా ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ వాటర్​చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్​లో పోసి చీమలపై స్ప్రే చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..