Couple on Car: నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..

నదిలో నిండా మునిగిన కారు.. అతికష్టమ్మీద టాప్‌ పైకి ఎక్కి కూర్చున్న జంట.. వరద ఉద్ధృతి కారణంగా సహాయక బృందం కూడా వారిని రక్షించలేని పరిస్థితి.. వారు ప్రాణాలతో బయటపడగలరా లేదా అని ఊపిరిబిగబట్టి చూస్తున్న జనం.. ఇలా ఏకంగా రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరకు నీటి ఉద్ధృతి తగ్గడంతో వారిని కాపాడగలిగారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Couple on Car: నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..

|

Updated on: Sep 13, 2024 | 5:17 PM

నదిలో నిండా మునిగిన కారు.. అతికష్టమ్మీద టాప్‌ పైకి ఎక్కి కూర్చున్న జంట.. వరద ఉద్ధృతి కారణంగా సహాయక బృందం కూడా వారిని రక్షించలేని పరిస్థితి.. వారు ప్రాణాలతో బయటపడగలరా లేదా అని ఊపిరిబిగబట్టి చూస్తున్న జనం.. ఇలా ఏకంగా రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరకు నీటి ఉద్ధృతి తగ్గడంతో వారిని కాపాడగలిగారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గుజరాత్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ వైరల్‌గా మారాయి. భారీ వర్షాలతో గుజరాత్‌లో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో సాబర్‌కాంఠా జిల్లాకు చెందిన సురేశ్‌ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్‌ నదిని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఆ ప్రవాహంలో 1.5 కి.మీ దూరం కొట్టుకుపోయిన ఆ కారు.. చివరకు ఓ చోట ఆగిపోయింది.

వరద మరింత పెరిగి.. కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది. అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి వాహనం పైభాగానికి చేరుకున్నారు. కారు పైభాగంలో కూర్చొని తమ ఫోన్‌తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో వారిని బయటకు తీసుకురాలేకపోయారు. అలా దాదాపు రెండు గంటలపాటు మిస్త్రీ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చుండిపోయారు. చివరకు నీటి ప్రవాహం కాస్త తగ్గడంతో సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us