Vietnam Floods: కూలిన ఉక్కు వంతెన.. నీళ్లలో పడ్డ 10 కార్లు, ట్రక్కులు, 2 బైక్‌లు..
అత్యంత శక్తిమంతమైన తుపాను యాగి ప్రభావంతో వియత్నాం దేశం వణికిపోయింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది. ఉత్తర వియత్నాంలో అనేక నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఓ ఐరన్ బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు కొట్టుకుపోయాయి. మరో ఘటనలో 20 మంది ప్రయాణికులతో ఓ బస్సు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

ఉత్తర వియత్నాంలోని ఫు తో ప్రావిన్స్‌లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ముగ్గుర్ని బయటకు తీసుకురాగా.. మరో 13 మంది గల్లంతయ్యారు. మరో ప్రావిన్స్ కావో బాంగ్‌లో వరదలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ జల ప్రవాహంలో 20 మంది ప్రయాణికులతో ఓ బస్సు కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ.. ఘటనా ప్రదేశానికి చేరుకోలేక ఆగిపోయాయి.
యాగి టైఫూన్ శనివారం వియత్నాం తీరం దాటగా.. ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 30 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్‌లలో ‘యాగి’ని ఒకటిగా చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.