CRED Cheating: జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!
లాటరీలు, జాక్‌పాట్‌ల్లో ఎంతో మంది రూ.లక్షలు గెలుచుకున్నారన్న వార్తలు తరచూ వింటుంటాం. సామాన్యులు కూడా ధనవంతులుగా మారిపోవడాన్ని చూస్తుంటాం. కానీ, ఇటీవల జాక్‌పాట్ లో రూ. 3.25 లక్షల విలువైన వస్తువులు గెలుచుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆ కంపెనీ కేవలం రూ.వెయ్యి అతడి చేతిలో పెట్టింది. అసలేం జరిగిందంటే..?

క్రెడ్ ఇటీవల నిర్వహించిన ఫ్రైడే జాక్‌పాట్‌లో ఓ వ్యక్తి పాల్గొన్నాడు. అందులో గేమ్ ఆడి దాదాపు రూ. 3.25 లక్షల విలువైన వస్తువులను గెలుచుకున్నాడు. దానిలో మ్యాక్‌బుక్, ఐపాడ్, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఓ బ్యాగ్ ఉన్నాయి. అయితే.. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీయే విన్నర్‌కి తెలియజేయడం అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ జాక్‌పాట్‌పై టీడీఎస్ చెల్లింపులకు కోసం పాన్ వివరాలు అప్లికేషన్ ఫామ్‌లో రాయాలని కంపెనీ కోరింది.
ఆ తర్వాత ఆ విన్నర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. సాంకేతిక లోపమంటూ జాక్‌పాట్‌ను కంపెనీ రద్దు చేసింది. ఆ తర్వాత విషయాన్ని విన్నర్‌కు తెలియజేసిన కంపెనీ.. చివరికి అతడి అకౌంట్‌కి కేవలం రూ. వెయ్యి పంపించింది. దీంతో అతడి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. విషయాన్ని వివరిస్తూ అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాన్ని కంపెనీ సీఈఓ కునాల్ షాకు ట్యాగ్ చేశాడు. ఈ పోస్టు కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.