
సరీసృపాలలో కొండచిలువలు పెద్దవి అని అంటారు. కాయంలోనే కాదు.. పొడవులోనూ ఇవి భారీగా పెరుగుతాయి. మాములుగా ఓ కొండచిలువ ఏకంగా మనిషిని సైతం అమాంతం మింగేస్తుంది. అలాంటిది కొండచిలువను దూరం నుంచి చూస్తేనే ప్యాంట్ తడిసిపోతుంది. మరి దగ్గర నుంచైతే.. పైప్రాణం పైనుంచే పోతుంది. పాములను, పైథాన్‌లు పట్టుకునేవారు.. చాలా చాకచక్యంగా వాటిని బంధిస్తారు. ఏ చిన్న తేడా వచ్చినా అది కాటేస్తుంది. మరి మన ముందు ఓ 16 అడుగుల భారీ పైథాన్ ఉంటే.. దాన్ని ఎలా పట్టుకోగలం చెప్పండి. మరి ఈ వీడియో చూస్తే మీరు వణకడం ఖాయం.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
వైరల్ వీడియో ప్రకారం.. ఓ అటవీ ప్రాంతంలో 16 అడుగుల భారీ పైథాన్ జరజరా పాకుతూ తన ఆవాసానికి వెళ్తుండగా.. ఓ వ్యక్తి దాని తోకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది రెండుసార్లు అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఎలాంటి లాభం లేకపోయింది. చివరికి అతడు ఆ కొండచిలువ తలను గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియో ద్వారా అతడు ఓ కొండచిలువను ఎలా పట్టుకోవాలనేది నెటిజన్లకు చూపించాడు. ఇక ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్ కాగా.. దాన్ని చాకచక్యంగా బంధించాడు. ఇది ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓసారి లుక్కేయండి.
ఇది చదవండి: నీటి అడుగున తేలియాడుతున్న వింత జీవి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్