AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Tips: ఇన్‌స్టా రీల్స్‌కు మిలియన్ వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది..? ఎలా వస్తుంది..?

ఇన్‌స్టా రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతిఒక్కరు టైమ్ పాస్ కోసం రీల్స్ చూస్తుంటారు. కానీ ఈ రీల్స్ ను ఉపయోగించుకుని కొంత మంది భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక రీల్‌కు మిలియన్ వ్యూస్ వస్తే డబ్బు ఎంత వస్తుంది.? అసలు డబ్బు ఎలా వస్తుందనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

Instagram Tips: ఇన్‌స్టా రీల్స్‌కు మిలియన్ వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది..? ఎలా వస్తుంది..?
Instagram
Krishna S
|

Updated on: Jul 19, 2025 | 3:50 PM

Share

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేని వారు చాలా తక్కువ. చిన్న నుంచి పెద్దవాళ్ల దాకా ప్రతి ఒక్కరు కాలక్షేపానికి ఇన్‌స్టా రీల్స్ చూస్తారు. చూస్తున్నాకొద్దీ రీల్స్ వస్తూనే ఉంటాయి. ఇక రీల్స్‌ చేస్తూ క్రేజ్ సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. క్రేజ్ మాత్రమే కాదు ఆదాయాన్ని కూడా గట్టిగానే వెనకేసుకుంటున్నారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారు ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. అందుకే చాలా మంది ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు మంచి కంటెంట్‌ను  నమ్ముకుంటే.. మరికొందరు వైరల్ కంటెంట్‌తో ఫేమస్ అవుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పైసలు ఎలా వస్తాయి..? ఎన్ని వ్యూస్ వస్తే ఎంత వస్తుంది..? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి.

ఇన్‌స్టాగ్రామ్ స్వయంగా కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు ఇవ్వదు. కానీ పరోక్షంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి. వివిధ బ్రాండ్లకు ప్రచారం చేయడం ద్వారా మనీ సంపాదించొచ్చు. బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి కంటెంట్ క్రియేటర్స్‌ను సంప్రదిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎక్కువ వ్యూస్ వచ్చే వారిని వివిధ కంపెనీలు ఎక్కువగా సంప్రదిస్తాయి. కాబట్టి ఫాలోవర్స్, రీల్స్‌కు వచ్చే వ్యూసే ఇక్కడ కీలకం అన్నమాట. ఇప్పటికే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక్కడ మీకున్న ఫాలోవర్స్, వ్యూస్‌ను బట్టి డబ్బు వస్తుంది. మరికొంతమంది బ్రాండ్ లింక్‌లను వారి అకౌంట్ హ్యాండిల్స్‌లో షేర్ చేస్తారు. దీని ద్వారా వారికి కమిషన్ వస్తుంది.

ఏదో ఒక ఇన్‌స్టా రీల్ మిలియన్ పోయినంత మాత్రాన డబ్బులు వస్తాయనుకుంటే పొరపాటే. మీ ప్రతి రీల్‌కు భారీగా వ్యూస్, లైక్‌లు, ఫాలోవర్స్ ఉంటే బ్రాండ్లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. ఇలా వాటి ప్రమోషన్ ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు. సాధారణంగా మిలియన్ వ్యూస్‌కు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బ్రాండ్లు ఇస్తుంటాయి. అది మీ ప్రజాదరణ, బ్రాండ్ బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలలో కంటెంట్ క్రియేటర్స్‌‌కు ఇన్‌స్టాగ్రామ్ నేరుగా డబ్బులు చెల్లిస్తుంది. కానీ మన దేశంలో అది అందుబాటులో లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !