How Car Airbags Works: ఎయిర్ బ్యాగ్స్ నిజంగా రక్షిస్తాయా..? కారులో ఎయిర్ బ్యాగ్ ఉంటేనే సరిపోతుందా..?

| Edited By: Jyothi Gadda

Oct 29, 2023 | 6:51 PM

ఇంజన్ లో కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్ లో కానీ ఏమైనా మార్పులు చేస్తే ఎయిర్ బ్యాగ్ కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. కంపెనీతో వచ్చిన సీట్లను కొంతమంది మారుస్తూ ఉంటారు... దీంతోపాటు సీట్ల పైన కొత్త కొత్త ఉంటారు. ఇవి బాగా మందమైనా సీట్ కవర్లు వాడిన, ఎయిర్ బ్యాగ్ ఉన్నచోట.. గ్యాప్ వదిలిపెట్టకపోయినా సీట్లకు ఉన్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావు. వాహనం కేవలం రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఉపయోగపడుతుంది. అదే నీళ్లలోనూ, మంటల్లో పడితే ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

How Car Airbags Works: ఎయిర్ బ్యాగ్స్ నిజంగా రక్షిస్తాయా..? కారులో ఎయిర్ బ్యాగ్ ఉంటేనే సరిపోతుందా..?
Car Airbags
Follow us on

ప్రతి కారులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు కామన్. కేంద్ర ప్రభుత్వం కూడా బేసిక్ మోడల్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనేది నిబంధనగా పెట్టింది. ఇండియాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపడుతున్న చర్యల్లో ఈ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఒక ప్రికాషన్. ఏ కంపెనీ కారైన ఏ మోడల్ అయిన… ముందు, వెనక, కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టాప్ ఎయిర్ బ్యాగ్స్ ఇలా ఎక్కడైనా మొత్తం కలిపి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాల్సిందే… ఇదంతా ఓకే.. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నిజంగా ఎయిర్ బ్యాగ్స్ రక్షిస్తాయా? ఇక కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని ఎంత స్పీడ్ గా అయినా వెళ్లొచ్చా.. అసలు ఎయిర్ బ్యాగ్స్ ఏ సందర్భంలో ఓపెన్ అవుతాయి.

ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి?

– కార్‌లో కామన్ గా డ్రైవర్ కి ప్యాసింజర్ కి ఎదురుగా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. దాంతోపాటు విండోస్ పైన మరో రెండు, ఫ్రంట్ సీట్ పక్కన ఇంకొక రెండు అమరుస్తారు. వీటితోపాటు వెనకాల, పైన కూడా మార్చడం కొన్ని మోడల్స్ లో ఉంటుంది. అయితే కారు స్పీడ్ కి ఎయిర్ బ్యాగ్ కి సంబంధం ఉంది. ఎయిర్ బ్యాగ్ లో ఒక సెన్సార్ ఉంటుంది. అది స్పీడ్ అండ్ బ్రేకింగ్ సిస్టం కి కనెక్ట్ అయి ఉంటుంది. 40 కిలోమీటర్ల స్పీడ్ దాటిన తర్వాతే ఎయిర్ బ్యాగ్ ఆక్టివేట్ అవుతుంది. 40 కిలోమీటర్ల స్పీడ్ దాటిన తర్వాత…. ఒక సెకండ్లో 6 వంతుల వేగంతో బ్రేక్ నొక్కినట్లయితే వెంటనే సెన్సార్ ఎయిర్ బ్యాగ్ ని బ్లాస్ట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్ వల్ల వచ్చే శబ్దం, పగిలే మెటీరియల్ చాలా తక్కువ. లాస్ట్ తర్వాత ఒక్కసారిగా ఎయిర్ బెలూన్ పూర్తిగా ఓపెన్ అయిపోయి మన శరీరాలకు ఏం కాకుండా రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్ బ్యాగ్ ఎప్పుడు పనిచేయదు?

– కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పుడు కచ్చితంగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ కున్న సెన్సార్ ఆక్టివేట్ అవ్వదు. చాలామంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా సీట్ బెల్ట్ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఎలాంటి సందర్భంలోనైనా కారు ఎలాంటి ప్రమాదానికి గురైన… 60 శాతం వరకు ప్రాణాలను కాపాడేది సీట్ బెల్ట్ మాత్రమే. దీంతోపాటు అన్ని డోర్లు పూర్తిగా లాక్ అయితేనే ఎయిర్ బ్యాగ్ సెన్సార్ పని చేస్తుంది. ఇంజన్ లో కానీ, ఎలక్ట్రికల్ వైరింగ్ లో కానీ ఏమైనా మార్పులు చేస్తే ఎయిర్ బ్యాగ్ కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. కంపెనీతో వచ్చిన సీట్లను కొంతమంది మారుస్తూ ఉంటారు… దీంతోపాటు సీట్ల పైన కొత్త కొత్త ఉంటారు. ఇవి బాగా మందమైనా సీట్ కవర్లు వాడిన, ఎయిర్ బ్యాగ్ ఉన్నచోట.. గ్యాప్ వదిలిపెట్టకపోయినా సీట్లకు ఉన్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావు. వాహనం కేవలం రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఉపయోగపడుతుంది. అదే నీళ్లలోనూ, మంటల్లో పడితే ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..