AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గుర్రం తోక చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఏకంగా 13 అడుగులు! గిన్నిస్ రికార్డ్ సొంతం!

అమెరికాలోని ఒహాయోకు చెందిన మౌంట్‌జాయ్ ఐస్ ప్రిన్సెస్ (జెన్నీ) అనే గుర్రం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 13 అడుగుల 6 అంగుళాల (412.62 సెం.మీ) పొడవైన తోకతో ఇది గుర్రాల విభాగంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన గుర్రంగా నిలిచింది. తోకను సంరక్షించడం కష్టమైనప్పటికీ, యజమానులు ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఈ రికార్డు జెన్నీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

ఈ గుర్రం తోక చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఏకంగా 13 అడుగులు! గిన్నిస్ రికార్డ్ సొంతం!
Horse Breaks Guinness RecordImage Credit source: Guinness World Records
Balaraju Goud
|

Updated on: Sep 24, 2026 | 12:53 PM

Share

సాధారణంగా ప్రపంచ రికార్డులు మనుషులు, క్రీడలు లేదా ప్రత్యేకమైన వస్తువులకు సంబంధించినవిగా ఉంటాయి. కానీ అమెరికాలోని ఒహాయోకు చెందిన ఓ గుర్రం తన అసాధారణమైన పొడవాటి తోకతో చరిత్ర సృష్టించింది. మౌంట్‌జాయ్ ఐస్ ప్రిన్సెస్ అనే ఈ ఆడ గుర్రాన్ని ప్రేమగా ‘జెన్నీ’ అని పిలుస్తారు. గుర్రాలలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన గుర్రంగా జెన్నీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

జూలై 25న నిర్వహించిన అధికారిక కొలతల్లో జెన్నీ తోక పొడవు ఏకంగా 412.62 సెంటీమీటర్లు అంటే 13 అడుగుల 6 అంగుళాలుగా నమోదైంది. ఇది దాదాపు ఓ చిన్నపాటి కారు పొడవుతో సమానం. గతంలో 2007లో JJS సమ్మర్ బ్రీజ్ అనే గుర్రం 381 సెంటీమీటర్ల తోకతో నెలకొల్పిన రికార్డును జెన్నీ అధిగమించింది.

జెన్నీ అమెరికన్ సాడిల్‌బ్రెడ్ జాతికి చెందిన గుర్రం. అమెరికాలోని ఒహాయోలోని స్ప్రింగ్ వ్యాలీలో ఉన్న అశ్వ శిక్షణ కేంద్రంలో ఇది నివసిస్తోంది. మెకెంజీ లోవ్, రాచెల్ ఎస్టెస్ జెన్నీ యజమానులు. 2019లో తన 13వ పుట్టినరోజు సందర్భంగా మెకెంజీకి జెన్నీ బహుమతిగా వచ్చింది.

జెన్నీకి ఇంత పొడవైన తోకను సంరక్షించడం అంత సులభమైన విషయం కాదు. నెలకు కనీసం ఒకసారి, అవసరమైనప్పుడు తోకను శుభ్రం చేసి, షాంపూ, కండిషనింగ్, ఆరబెట్టడం, చిక్కులు తొలగించడం, జడ వేయడం వంటి పనులకు సుమారు నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుందట. తోకకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకంగా జడ వేసి, ఆ తర్వాత టెయిల్ బ్యాగ్‌లో ఉంచుతారట. చిన్న వయసులో జెన్నీ తన తోకను తానే పీకేసుకునేదట. అప్పట్లో పెద్దగా పొడవు లేకపోయినా, కాలక్రమంలో అది పెరుగుతూ వచ్చింది. చివరకు ప్రపంచ రికార్డు ప్రయత్నించేంత పొడవుకు చేరుకుంది.

జెన్నీకి ఈ రికార్డు మాత్రమే ప్రత్యేకత కాదు. తన యజమానికి ఇది ఎంతో మధురమైన, తెలివైన గుర్రం. ప్రపంచ రికార్డు సాధించడంతో యజమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక గుర్రాలతో పాటు కుక్కలు, పిల్లులకూ పొడవైన తోకలకు సంబంధించిన ప్రత్యేక గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. కానీ 412.62 సెంటీమీటర్ల తోకతో జెన్నీ మాత్రం గుర్రాల విభాగంలో కొత్త రికార్డు సృష్టించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!