కాకి జీవితం గురించి తెలుసా? ఇది మరీ ఇంత తెలివైనదా?
samatha
6 November 2026
Pic credit - Pinterest
కాకి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. దీనిపై అనేక జానపద కథలు ఉన్నాయి. చాలా మంది కాకిని పూర్వికులుగా భావించి ఆహారం పెడుతుంటారు.
కాకి
అంతే కాకుండా ఎవరు అయినా చనిపోయినప్పుడు కాకి ఇంటికి వస్తే తమ బంధువే వచ్చాడు అని ఆహారం పెట్టం వంటిది చేస్తుంటారు.
ఆహారం
మరి ఇలాంటి కాకి జీవితం గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకున్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ మన ఇళ్ల దగ్గర కనిపించే కాకి, కేవలం ఒక సాధారణ పక్షి కాదు, ప్రకృతి సృష్టించిన అత్యంత తెలివైన జీవులలో ఒకటి.
కాకి జీవితం
కాకి సమస్యలను పరిష్కరించడంలో చాలా ముందు ఉంటుంది. అంతే కాకుండా, అది మనుషుల ముఖాలను గుర్తుంచుకోగలదు, కొన్నిసార్లు పనిముట్లను కూడా ఉపయోగించగలదంట
సమస్యలు పరిష్కరించడం
కాకి జీవిత చక్రం గుడ్డుతో మొదలవుతుంది. బ్రీడింగ్ సీజన్లో, మగ, ఆడ కాకులు జతకట్టి, కొమ్మలు, గడ్డితో గూడు నిర్మిస్తాయి. ఆడ కాకి గుడ్లు పెట్టి పొదుగుతుంది.
జీవిత చక్రం
కొన్ని వారాల తర్వాత గుడ్ల నుండి పిల్ల కాకులు బయటకు వస్తాయి. పుట్టినప్పుడు ఎగరడం రాని ఈ పిల్లలను తల్లిదండ్రులు ఆహారం తెచ్చి పోషిస్తాయి.
కాకి పిల్లలు
నెమ్మదిగా వాటికి ఈకలు వస్తాయి, ఎగరడానికి ప్రాక్టీస్ చేస్తాయి. ఒకరోజు గూడు నుండి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఎగరడం ప్రారంభిస్తాయి.
ఎగరడం
కాకులు సర్వభక్షకాలు, అంటే పురుగులు, పండ్లు, గింజలు, చిన్న జీవులు, మనుషులు వదిలేసిన ఆహారం కూడా తింటాయి. అందుకే అవి నగరాల నుండి అడవుల వరకు ఏ వాతావరణానికైనా సులభంగా అలవాటుపడతాయి.
ఆహారం
సమస్యలను పరిష్కరించడం, ఆహారాన్ని తర్వాత తినడానికి దాచిపెట్టడం , ప్రమాదం కలిగించిన మనుషుల ముఖాలను గుర్తుపెట్టుకోవడం వంటి అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తాయి.
సమస్యలు
ఒక చనిపోయిన కాకి దగ్గర మిగతా కాకులు గుమిగూడటం, ప్రమాదం గురించి తెలుసుకునే ప్రయత్నంగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఇలా, తెలివి, అనుకూలతతో నిండిన కాకి జీవితం కొనసాగుతుంది.