AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon in the Air: ఆకాశంలో హనీమూన్.. జంటల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్..

Honeymoon in the Air: ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ వేసుకుంటుందో.. తమ హనీమూన్‌ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.

Honeymoon in the Air: ఆకాశంలో హనీమూన్.. జంటల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్..
Honeymoon In Plane
Shiva Prajapati
|

Updated on: Nov 16, 2021 | 6:09 PM

Share

Honeymoon in the Air: ప్రతి జంట తమ పెళ్లిని ఎంత ప్రత్యేకంగా చేసుకోవాలని ప్లాన్స్ వేసుకుంటుందో.. తమ హనీమూన్‌ను కూడా అంతకు మించి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత, జంటలు తమ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించడానికి హానీమూన్ పేరుతో విదేశాలకో, టూరిస్ట్ స్పాట్‌లకో, ప్రత్యేక ప్రాంతాలకో వెళ్తారు. నూతన జంటల ఆలోచలను ఒడిసిపట్టిన ఓ ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ప్యాకేజీ ప్రకటించింది. అమెరికాకు చెందిన లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ‘రాయల్ హనీమూన్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

హనీమూన్‌ను మధురానుభూతిగా నిలుపుకోవాలనుకునే వారి కోసం లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నూతన జంటలు తమ హనీమూన్‌ను విమానాల్లో జరుపుకునేలా ప్లాన్ వేశారు. ఇందుకోసం జంటలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు. హనీమూన్ కోసం ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకోవడానికి కేవలం 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే భారతీయ కరెన్సీలో 73 వేల రూపాయలు అనమాట. అయితే, ఈ మొత్తం చెల్లిస్తే 45 నిమిషాల ప్రయాణానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం కావాలనుకుంటే.. మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, ఈ విమానంలో ప్రత్యేకంగా రాయల్ హనీమూన్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. రూ. 75 వేలు చెల్లిస్తే దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే ఉంటుంది. ఇంకా సమయం కావాలనుకుంటే.. అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీస్‌లు, సదుపాయాలను చూసి మీ హనీమూన్‌ను ప్రత్యేకంగా మార్చుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక పైలట్ ఉంటాడు. అలాగే.. పైలట్ కాక్‌పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు. సో.. జంట గోప్యతకు కూడా సమస్య ఉండదు. గత ఏడు సంవత్సరాలుగా లవ్ క్లౌడ్ కంపనీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సేవలను అందిస్తూ వస్తోంది. రిమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీ కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విమానంలో హనీమూన్‌కు శ్రీకారం చుట్టింది.

Also read:

Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

ఏపీలో ఆన్‌లైన్‌ చైల్డ్‌ పోర్న్‌ రాకెట్‌పై సీబీఐ ఫోకస్.. తిరుపతి, విజయవాడలో సోదాలు.. 

Viral Video: ఇదెక్కడి సీన్ గురూ..! రిమోట్‌తో కంట్రోల్ చేస్తూ డ్రోన్‌ను ఎగరేస్తున్న చింపాంజీలు! వీడియో వైరల్