AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి నాయనో.. తొండలు ఏంది ఇలా ఫైట్ చేస్తున్నాయి.. చూస్తే షాకే..!

ఒకే జాతికి చెందిన రెండు ప్రాణుల మధ్య యుద్ధం జరగడంతో ఈ వింత చూసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పోట్లాటను తామెప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు. ఒకే జాతికి చెందిన ప్రాణుల మధ్య యుద్ధం ఎలా జరిగింది...?

Viral Video: ఓరి నాయనో.. తొండలు ఏంది ఇలా ఫైట్ చేస్తున్నాయి.. చూస్తే షాకే..!
Oriental Garden Lizards
B Ravi Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 09, 2024 | 2:59 PM

Share

జంతువుల మధ్య జాతి వైరం కారణంగా ఒక జాతికి చెందిన జంతువుపై మరొక జాతికి చెందిన జంతువు దాడులు చేసుకోవడం సహజం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో తమ జాతి వైరాన్ని పక్కన పెట్టి కొన్ని జంతువులు ప్రేమగా కలిసి మెలిసి ఉంటాయి. ఆ కోవలోనే ఇటీవల కుక్క, పిల్లి కలిసిమెలిసి ఉండడం, పంది కుక్క పిల్లలకు పాలు ఇవ్వడం, ఇలా రకరకాల జంతువులు తమ జాతి వైరాన్ని పక్కన పెట్టి కలిసిమెలిసి ఉన్న సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇక్కడ జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఒకే జాతికి చెందిన రెండు ప్రాణుల మధ్య యుద్ధం జరగడంతో ఈ వింత చూసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పోట్లాటను తామెప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు. ఒకే జాతికి చెందిన ప్రాణుల మధ్య యుద్ధం ఎలా జరిగింది…? ఆ ప్రాణులు ఏంటి..? అవి ఒకదానికొకటి తలపడడానికి దారి తీసిన అంశాలపై ఇప్పుడు ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం.

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. రెండు తొండలు ఒకదానిపై ఒకటి నువ్వా నేనా అంటూ కలబడి కొట్టుకున్నాయి. అయితే ఆ వింతను చూసిన అక్కడ వారందరూ తొండల మధ్య ఫైటింగ్ చూసి షాక్ అయ్యారు. తొండలు సహజంగా చెట్ల పైన, గుబురుగా ఉన్న మొక్కలు, చల్లని, వేడి ప్రదేశాలలో జీవిస్తాయి. చిన్న చిన్న కీటకాలను తమ పదునైన నోటితో కరచి పట్టుకుని ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. ఈ క్రమంలో ఓ తొండ ఓ కీటకాన్ని వేటాడడానికి చెట్ల గుబురులో నుంచి బయటికి వచ్చింది. ఎంతో నేర్పుగా దానిని పట్టుకుని ఆహారంగా తీసుకోవాలని అనుకుంది. అయితే అదే సమయంలో వేరొక తొండ సైతం అదే కీటకాన్ని వేటాడి తన కడుపు నింపుకోవాలనుకుంది.

దీంతో రెండు తొండలు ఒకే కీటకంపై వేటకు గురిపెట్టడంతో రెండింటి మధ్య వైరం ఏర్పడింది. దాంతో ఒకదానితో ఒకటి తలపడడానికి సిద్ధమయ్యాయి. అనుకున్నదే తడవుగా రెండు వీరోచితంగా పోరాడటం మొదలుపెట్టాయి. దాదాపు 20 నిమిషాల పాటు రెండు తొండల మధ్య పోరాటం ఎంతో భయానకంగా సాగింది. తర్వాత ఏమైందో ఏంటో తెలియదు గాని రెండు ఒకదానిని రెండు తొండలు వెనక్కి తగ్గి మరల తిరిగి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయాయి. అయితే అక్కడే ఉన్న స్థానికులు కొందరు తొండల మధ్య జరిగిన పోరాటాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్‌గా మారాయి.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…