కాపీ కొట్టడం ఓ ఆర్ట్. ఇక ఇతరులను చూసి ఫాలో అవ్వాలి అన్నా.. వారిలా ప్రవర్తించాలనుకున్నా.. ముందుగానే ప్రక్టీస్ ఉండాల్సిందే. అయితే ఇవి మనుషులకు మాత్రమే.. నాకు కాదంటుంది ఓ కోడి. మనిషి చూసి కాపీ కొట్టడమైన..ఎస్కేప్ కావాలన్నా నా తర్వాతే ఎవరైనా అంటుంది. ఈ కోడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే కోడి తెలివికి ఆశ్చర్యపోవడమే కాదు.. చేసిన అల్లరి పనికి నవ్వకుండా ఉండలేరు. ఇంతకు ఏం చేసింద తెలుసుకుందామా.
సాధారణంగా.. ఇతర జంతువులు.. పక్షులతో పాటు పోలిస్తే..కోళ్లకు అంతగా తెలివి ఉన్నట్టుగా కనిపించదు.. కోతులు.. కుక్క పిల్లలు.. పిల్లులు మనుషులు చేసే పనులను సులువుగా పసిగట్టేస్తాయి. అంతేకాకుండా.. మనషులతోపాటే.. ఎన్నో ఫన్నీ పనులను చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఓ కోడి మాత్రం సులువుగా మనిషిగా కాపీ కొట్టింది. ఆ వీడియో ఓ వ్యక్తి.. కాలికి గాయం కావడంతో కర్ర సాయంతో కుంటుతూ నడుస్తున్నాడు. అయితే అతని వెనకాలే ఓ కోడి కూడా వెళ్తుంది. ఆ వ్యక్తి కుంటడడం చూసి కోడి కూడా కుంటుతూ అతడిని కాపీ కొట్టింది. ఇది గమనించిన సదరు వ్యక్తి తనను వెక్కిరిస్తున్న ఆ కోడిని కొట్టేందుకు కర్రను తీయగా. అక్కడ నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ కోడి తెలివికి నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
Also Read: Viral Video: ఎలుగు బంటికి చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వుకుండా ఉండలేరు..
Puneeth RajKumar: పునీత్ రాజ్ కుమార్కు సూర్య నివాళి.. అప్పు సమాధిని చూసి హీరో ఎమోషనల్..